Sunday, September 6, 2015

Tuesday, 28 May 2013 at 10:35 UTC+05:30

ఆత్మ అజమూ,అమరమూనట


.

ఆత్మ అజమూ,అమరమూనట. నాకర్ధంకానిది మనసే!
అది ఆత్మ తోబాటో మరి, వెలుగుకు నీడో, కాని
కనుపించని ఆత్మ తాలూకు 'నీడ' దేహంగా కనుపిస్తుందా?
మనసేమో,తన ఇష్టాలేమో, మొలకై,తీవై రాగరంజితమౌతుంది.
రంగులన్నీ,కొరికలే! కొరికలన్నీ, మోదకాలే! ఆత్మామోదకాలా,కాదా?
ఆవిషయం ఆత్మేమీ పట్టించుకోదు. అయితేనేం,
తనకీ మనసుకూ మధ్య సూది బెజ్జంలో సూర్యుడిలా,
శరీరధారణకి ముందె, బుద్ధి పాలుపోసుకుందిగా!
అది విచక్షిణి. అంతే.మనసు మాయకి నలుసట.
అది,ఇంతింతై ప్రపంచమంతై తాను
చేరనీ,స్పర్సించనీ,వునికేలేదనుకుని
తలపుల తలుపుల  సందుల్లో దూరి
దురాగతమో, స్వాగతమో ఆలోచనే చెయ్యదు.
ఇతరమనస్సులుంటాయిగా,అవి
బుద్ధి బలమైనవై కూడా వుండచ్చు
.తన అధీనములోవున్న శరీరాన్ని కాదంటే
ఎడ్చుకుంటుంది. ఆత్మని నిందిస్తుందీ.
అన్నీ తన ఇష్టమైనప్పుడుకూడా
కష్టాన్నేమాత్రమూ,భరిన్చదు తను.
తను అంటే,హౄద్భాషలున్న తనువే.
కాని వినదుగా,ఎంతసెపూ వృద్ధి, కృద్ది!
సుద్ధీ,బుద్ధీ అరుదే. అందుకనే,
అనేకజన్మలూ,చావులూనూ
. శరీరాన్ని పారేసుకున్నప్పుడల్లా
యాతనలే పాపం, అప్పుడు దీపాన్ని తెలుసుకుని
జ్ఞానాన్ని పొంది మళ్ళీ ప్రార్ధిస్తుంది,మరొకసారి
సశరీర మౌదామనీ,సౌదామ సనక సనందనాదులౌదామని.

No comments:

Post a Comment