అమ్మా మీరు తిరునామ నిజ రూప వైభవముతో
వకుళ మాత కైవడి కనపడినారు,కలైనా ఎంతవైభవము?
వెంకటేశ్వరునికి అమ్మ అయ్యారుగా.
అంటే స్వామివారి భుక్త శేషము పుష్పక ప్రసాదమౌనుగా.
వెంకటేశ్వరా! కొలువైననిన్ను కొలువగలేని సిగ్గరి వైష్ణవులమే
. నిలువెత్తు నిన్ను, తడిసిన మా కన్నులతో
కని కనకముందే నీకింకరులు నెట్టివైతురే.
కాని మాయమ్మ నీకునమ్మైనదిగా,
ఇక కృష్ణుడు మాకు తమ్ముడే. నీలమెఘ ఘనా
,ఆడుకోడానికి అమ్మ పంపితే, అప్పుడప్పుడు
కొండదిగిరా ఇక్కడెవ్వరూ వుండరు.
కేవల సేవల మంత్ర, మంగళనీరాజనాల
వైకుంఠము నుంచి వస్తావా తండ్రీ?,
పెందలకడనే మేమందరమూ పండుకుంటాము,
బృందావనము లో ఎదురు చూస్తూ వుంటాము,
పిల్లనగ్రొవి మరువకు స్వామీ.క్రిష్ణ లీలలాడుకొందాము.
అమ్మనడిగి తాయిలాలు తే, మరువకు స్వామీ,.
మా బుల్లూ,దానక్క వైసూ నిజంగా
నువ్వంటే వెంట పడిపోతారు,వాళ్ళమ్మా అంతే.
చిన్నప్పుడు తాయిలాలందరి క్రిష్ణులకూ పంచి,
నీ బొమ్మకిచీరలుకట్టి పెళ్ళిళ్ళు చేసేది.
వస్తావు కదూ, మేమందరమూ వేరు వేరు వూళ్ళల్లోవున్నా,
నీ దయ వల్ల బృందావనంలొ ఆటలకొసం,
నీతొ పాటలకోసం కలుస్తాము.
మాయమ్మ ఎంత మంచిది,
నీకు వెన్న పనస,తొనలు
మాకు,భుక్తశేష తీర్థ ప్రసాద
సంపద.సరేనా అయ్యా?
No comments:
Post a Comment