చల్లగుండమ్మా.
Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
మడి కట్టుకున్నా ముట్టకండి
తడి బట్ట విప్పంటూ తండ్రిగారు.
మడి తగలడినట్టెవుందిగానీ
విడిగా వుండమన్రా అబ్బయి
అమ్మా మీరూరుకోండి ఈవాళ
తిధి వార వర్జ దోషం లేదు,అతిధులొస్తున్నారు.
ఓరేయి బాబూ కారం నూనె పసుపూ పులుపూ
తూకం వేసి ఖాయం చెయ్యి బక్ష్యం భొజ్యం ముఖ్యం
అమ్మా అల్లానే,కొంచం చిన్నగా మాట్లాడండి
సరే వడియాలుంటే అన్నీ వున్నట్టే
పెద్ద మడీ,తడీ అఖర్లా.. గారెలు బాగా వేగాయి
పాయసం రసకందాయమైంది అప్పాలూ,అరటి కూరా
ఓహ్ పనస పొట్టు కూర పండు మామిడి రసం
స్వాములొచ్చెశారు కొంచం ఒపికపట్టండమ్మా,
స్వాములూ,రండి దెవరవారు కటాక్షించండి
స్వామీ,తమరు మాపిత్రు దెవులు, తమరు విస్వే దెవులు
మరి మీరు విష్నువు రక్షించండి
అక్రోధనై,శొచవరి బాబూ ఋషు లెవరు
,మూలపురుషులెవరూ? ఓహో
ఆంగీరసులూ,భారన్యాస భగవతులూ,
మున్నేరువారూ ముక్కు పట్టుకోండీ,ఓం..
చాల్లెండి కాని తెమలండి 'అమ్మాగారూ' శమించండి,
కొంచం ఓరేయి నా తిరవధ్యయనం మరీ వర్షాల్లో వస్తుందేమో?
అరిసెలు చెయిస్తావట్రా? అల్లానే అమ్మా
వర్షమైనా వరదైనా అరిసెలూ,ఆవకూరా
ప్రేమతో పప్పు నూనెలతో అరటాకులో
నీకోసం నయివెద్యం పెదతా నమ్మా.
స్వీకరించి అశీర్వదిస్తావుకదూ.?
కల్లో నాన్న గారి థిరవధ్యయనం
అమ్మగారి ఆధ్వర్యములో
No comments:
Post a Comment