Tiruvengalan Swaamin updated his status.
మందమతిని కాకపోతే కందగడ్డతో
వళ్ళు రుద్దుకుంటానా?
స్నానం మాట అటుంచి ప్రాణంపోయే దురద
. ములుగుదామంటే
నీళ్ళులేని అలుగు వెక్కిరిస్తోంది.
గోక్కుందామంటే
గోళ్ళెప్పుడో తినేశా గోడకి రుద్దితే
,సున్నంతోడైంది. దురదకి అడ్డంలేదు
,దూరని గొందులేదు. పరుగోపరుగు
దూరంగా నీళ్ళపంపు.
దూరి కింద కూచుంటే,
డొక్క సుద్ధయితే, దేముడిని తల్చుకో
మంత్రం వేస్తా, మంట పోతుంది.
ఇదిగో ఈ పురిశెడు పుణ్యం పట్టు.,
ఇక పాపం చెయ్యకు,
పుట్ట గతులుండవ్ అమ్మా
చల్లనైందమ్మా చల్లగుండమ్మా.
No comments:
Post a Comment