Saturday, September 5, 2015

Thursday, 28 March 2013 at 22:53 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
You are what your deep, driving desire is As your desire is, so is your will As your will is, so is your deed As your deed is, so is your destiny - Bṛhadāraṇyaka Upanishad(Wilderness of Wisdom)


అమ్మ గురించి తెలుసుకుందాము: తెలుగునిఘంటువు ఆన్ లైను నుండి ఈ అర్ధాలన్నీ తెలిశాయి. అంబ: ఆవు దూడ అంబా అంటుంది కదూ. బహుశ:,అక్కడనుండే 'అంబా శబ్దము వుదయించి వుండవచ్చు. జనని: జన్మ నిచ్చిన దైవము కాబట్టి జనని అయ్యింది. కారక కారణ సంబంధము. ధాత్రి: ధరించింది,భరిస్తుంది,పోషిస్తుంది,పుదమి ఒక్క గడ్డి పరకకి జన్మనివ్వడానికి కూడా ప్రసవ వేదన పడుతుందని అమ్మ అంటె పుడమి తల్లికి చెల్లె అని గ్రహించాల్సిందే. ప్రజనిక: ప్రజననము అంతే శృస్టి నిరంతరాయముగా నిరపేక్షతో జన్మనివ్వగలిగిన శక్తి. ప్రసత్వరి: తను అనేకముగా తన రూపాలని వృద్ది చేసెడిది. ప్రసవిత్రి: ఇది దశనుగుణమైన పర్యాయ పదము. ప్రసువు: ప్రసూనము అంటె పువ్వని,ప్రసువు అంటె పుష్పించేదని తెలుస్తుంది. ప్రసూతి: ఇది అవస్తా జనితమైన పదము.ఈ దశ తర్వాత స్త్రీ మాత గా పిలువబడుతుంది. మాత: ప్రకృతికి మూలము,ఆద్యురాలు,ఓంకారము ప్రణవమై ప్రాణాధారమైతే,మా అనే స్వరము అట్టి ప్రాణాన్ని ధరించి జీవికి తరిచే వుపాయము నిచ్చేదని తెలుస్తుంది.ఒకటి కేంద్రకము(ఓంకారము),రెండవది,సర్వావరణము,శరీరమూ,ధారిణి,రూపమూ,గుణమూ,సర్వమూ,ప్రాణముతోకలసి. అనాదిగా అనంతమైన ప్రభలతో విశ్వ విశ్వంభరిగా ప్రకటితమౌతోంది. "స్ఫురితంబులమ్మయనఁ దేనియలొల్కెడి జిల్గుపాటతో"

No comments:

Post a Comment