నా దేశంలో కృత్య జడలువిప్పినట్లున్నది.
బట్టకట్టిన మనిషి బతుకు రోత చేస్తున్నాడు.
సమాజము మళ్ళీ జాంతవతావనమైపోయింది.
పిగ్మీలు బట్టకట్టకపోయినా కట్టుబాటున్నవారు.
వికసిస్తున్న నాగరీకతలో పుచ్చు పురుగులు
కుదుళ్ళని మేస్తూ,పుర్రెల నెర్రెలలొచేరుతున్నయి.
అన్నంలో విషంకల్పుకు భిన్నంచేసుకుతింటున్నారేమో?
శ్త్యనంలోనే విషం గ్రోలుతున్నారేమో?పసి తనము,
ముదుసలితనమూ,పసువూ,శిసువూ అన్నిటినీ
ఇచ్చాపూర్వక మ్ళేచ్చుడై తుచ్చపు చేస్టితాలతో
మానానికి ప్రాణానికి నీచ వ్రణమై రోగక్రిమినే నిశ్చయముగా నే
సమాజానికి సుఖరోగక్రిమినంటున్నాడు.
పీనుగుల్ని గానుగాడిన హిట్లరు మంచి వాడైపోయాడు,
మన సమాజపు అజులముందు,విలువలు
జరాభూతములైనవేమో? లేక నా దేశస్తులు
సూకర,కుక్కుట,సునకాది పర కాయ ప్రెవేశ
మస్తిష్క మద భరితులై వుల్లేఖిస్తునారేమో,
మన మానవ చరిత్రని. మేము,నాదర్లేనూ
,ఘజనీలకు నక్కకూ,కుక్కకూ సరి సాటేననీ
,తొర్రకూ,పసిబుర్రకూ, పెద్ద తేడా ఎంచమనీ,
చేస్టితాలతో ఘొషిల్లిపోతున్నారు. వెలకోట్లరూకలతో
ఎన్నికుత్తుకలైనా కోసెయ్యోచ్చనీ, మా అంశం అంటే,
మాంసము తినడమేనని అది లేతదైతే
,, రుచి శుచి అనీ, ఈ నాగ రీకులు
భావించేస్తొన్నట్లె కనిపిస్తోంది. శిక్ష వేసేదెవ్వరు,
గొంగళినిండా వెంట్రుకళే గొంతులో,నేలపై,సభల్లో,
చట్టంలో,అన్నంలో, కంచంలొ,లొసుగుల్లో
,చుట్టలు చుట్టలుగా చిక్కు వెంట్రుకలు.
జంధ్యలూ,నులకమంచం తాళ్ళూ,కేశాలూ,క్ళేశాలూ,
కుళ్ళూ,దుర్మాంసమూ,దుశ్చరితా, డబ్బుల జబ్బు
రాజ్యంలో రాబందుల చావులూ,అన్నీ రోజు వారి
వార్తలూ,నిత్యక్రుత్యాలూ,మరీ ఆశ్చర్యపడక్కరలేకుండా.
ఇవేమీ వార్తలు కావు,ఆర్తితో సామాన్యుడు చూసి
పారిపోయే సమాజ ద్రుశ్యాలే. మ్ళేచ్చా ఇచ్చకసాయితనానికి
గోవులూ,జీవులూ లేతగానే గతించిపోతున్నాయి.
బహుశహ ఇప్పుడు,ప్రళయం వస్తుందంటారా?
లేక కల్కి కత్తిపట్టి గుర్రమెక్కి,దివరాత్రాలూ
దిశ దెశలూ వున్మీలనము చెశేస్తాడంటారా?
ఎంతటి దౌర్భాగ్యమో,నిర్భయ,అభయ
అని చట్టమాశీర్వదిస్తోన్నా, భయం
నీడల్లో దాక్కోని వెంటాడుతోనే వుంది
No comments:
Post a Comment