=========Satyanarayana Charyulu Maringanti
ఆజమైనా గజమైనా పరివృత్తములోభ్రమిస్తూనేవుంటాయి!
భ్రమలు తొలిగిన పిదప, గజేంద్రుడు శ్రమావసిష్టమైనాడు.
నిజానికి మావిలో,మాయలో, ఆత్మ వెలుగొందే ప్రాణమే!
అనుకుంటే,జన్మంటే ''మావిలోంచి మాయ లోకి జన్మించడమనే''
ఆమరణ ప్రయాణమే. నే' నవజాతాన్నయినప్పుడు,
సుమసోభిత విమానములో దిగంతాలమధ్యన విహరించినగుర్తు.
తర్వాత పయస్సుగ్రోలి ప్రపంచములో పడ్డాను.
పళ్ళు రావడముతోనే పుట్టకతోవచ్చిన మూలమంత్రము
మేలమాడే వేళ కాకాసురుడెత్తుకెళ్ళాడు. వెతుకులాట
వేళ చిన్మయదశలోంచి మృణ్మయపాత్రలోకిజార.
వర్గాలువేరైనా మిత్రులే అయిన ఆరుగురూ
తోడైన పెద్దలనుంచి తోడుకాని పొరుగులదాకా
వేలెడు పిన్నలనుంచి వ్రగ్గులైన వృ ధ్ధు ల దాకా
చూస్తూ,నెనూ వ్రేళ్ళసందులగుండా అనుభవించాను
. ఇక ప్రేమంటే స్తూలంగానూ, సూక్ష్మంగానూ తెలిసినవాళ్ళు
మోక్షగాములనీ,ఇచ్చపూర్వక జీవులనీ
దాసులనీ,వసువులనీ వాసుదేవ బృత్యులనీ,
అత్యుతు గొల్చు వారని .నిజంగానే భావించా.
కానీ నిజాన్ని చూడనిచ్చగించడము నిజంగా కష్ట సాధ్యమే.========================================================
నేతులు త్రావి కప్పురపు విడెములు
ReplyDeleteనమలి అమలిన శృంగారపు కైతలని
తల మాసిన భాగొతుల కూతలెట్లోర్చె
భారతి నిన్నతులిత భక్తి గారవముల
శక్తి పాటవముల యోగజ్ఞానముల గాంచి
తరించి వైతరిణికి వంతెనలల్లిన నన్నయ,
తిక్కన,ఎర్రన పోతనల సాటి ఎవ్వెరే ఇలన?
అయ్యా పోతన నే మన్నున పుట్టిన సత్తె న్న ను
వెయ్యి చేతనల మనమ్మున ఎన్చితి ఎప్పటికైన
ఒప్పగు ఒంటిమిట్ట న వెలసిన రామభధ్రు నెంచి
తప్పక సాయిజ్య మోసగు కయితల జేసి తరీమ్ప
తిక్కన ఎంచిన ఎత్తున మంచిని యుక్తిగ నంచి
చక్కని సంచిక నొక్కటి ఇంచుక భక్తిన ముంచి
చిక్కని చీక టుల చిరు వెలుగుల బాల భానుని
రెక్కల వెలుగుల జయమును దిద్ధిన ఎఱ్రన నెంచి
చేసేద కవన సాధన కోదండ రామ
మోసెద నీదు పాదములాన భవ్యాశ్రిత
భక్తుల పాద రక్షలు బహు ప్రీతిన
బాపవె భ వ భమ్దములు