naaree makutamu mahaaraanee jhaansee lakshmeebai
Tiruvengalan Swaamin updated his status.
ఒక్క క్షణం నీ ప్రక్కన నిలవనీ నా కృత్యాలన్నీ నిత్యంవుండేవే
నిలవరించుకోలెని నామనసు పలవరించేది క్షణక్షణమూ
వెంటాడె వంటరితనాన్ని ఒక్క క్షణం నీవదనారవిందాన్ని
చూసి మళ్ళీ ప్రాణం పోసుకుంటాను,ఒక్కక్షణం
దీర్ఘంగా వూపిరి పోసుకోనీ మనస్వినీ మనసనే
సముద్రంలో తడిసిన నాహృదయం ఒక్కక్షణం
నీ దివ్యాత్మ వడపోతలో వేడిమిపొందేను.
గవాక్షంలోంచి పరికించి చూస్తే ఒక్కక్షణం
కాలం గనీభవించి ఏదైవ విన్యాసమో
నీ లాస్యము దిగంతాలలో ద్యోతకమైంది.
ఒక్క క్షణం నిలువు నన్ను నిలవరించుకొనీ
ఓ మనసా దేవీ వాగ్రూపీ,గుణమోహినీ,
ఒక్కక్షణం కటాక్షించు,ఆమరణమూ,
బతికేస్తాను ఒక్కక్షణం గుర్తులతో.
ఇప్పుడు ఈసమయము నీవదనము
హృదయారవిందము తో పూజించాల్సినది.
నాజీవితాన్ని నీకంకితమిచ్చే తరుణమిది.
నిశ్శబ్దములో కాలము నీహారమౌగాక.
నా ఆత్మ నీ సన్నిధిలో నిశ్వాస రహిత
దివాకరమై రాత్రిబవళ్ళ నుండి విశ్రాంతమౌగాక.
A freelance translation of PARAMAPOOJANEEYA VISWAKAVI RABEENDRANATH TAGORE'S ' A MOMENT OF INDULGENCE"
Tiruvengalan Swaamin shared a link.
Tiruvengalan Swaamin and Thozzappa Srinivasan are now friends.
Tiruvengalan Swaamin updated his status.
మాయమ్మ తెలుగమ్మ ఓయమ్మ గోదమ్మ క్రిష్ణమ్మ పెన్నమ్మ పిన్నమ్మ చిలుకమ్మ పలుకమ్మ రాయంచ నేనెంచ నీ సొగసుల పాలొంచ భద్రాధ్రి నగమున నగుచు నిల్చిన సీతమ్మ నీదు గళమున వైతు రావమ్మ కావమ్మ నాబాస యాసలనెల్ల.
Tiruvengalan Swaamin updated his status.
ఆశ్రమ మహోన్నతానందు నజ్ఞజన వివేకదాత స్థిరజ్ఞమరైక నేత సురంబును ధు:ఖ నివారకమగు పదమె యాశ్ర్యమని పట్టి బ్రతుకు మనస: మనసు మలంబు మాయ గరిమన్ గ్రమమై వికసించు జ్ఞాన సా ధనమునంగాని ఇంద్రియ కృతంబగు తెల్వినంగాని యేనికిన్ గనబడువాడు గాడు గతకాలముం,నేడును,ముందు,వాని క్రీ డన నధికుండనన్ ,దెలియమమ్మహితాత్మకు నాశృయించెదన్|| మన మనస్సు,శరీరమంతా కలయతిరుగుతూ,మలినమై పిదప,మాత్రు స్త్యన్య ప్రాణావసిస్ట అయి,ప్రపంచాన్ని చూడనారంభిస్తుంది.మరపు తెరుపు అన్నట్లు, నిద్రలోనేవుంటూ,కొంచెము మెలకువలో,మెలకువతో మాతృ దీవెనల ప్రఫుల్లతతో కొంచెం కొంచెంగా ప్రపంచంలో పడుతుంది.కానీ అంతకుముందున్న బదరీ నారాయణ స్పృహ క్షీణించి మాటలు,గురుతులూ,,కోరికలూ,లాలనపాలనలకై మారామూ,రాగాలూ,శిసువుని మనలోపడ వేస్తాయి.మన అంటె బాహ్యప్రపంచమేకదా. ఇంద్రియాలు,శరీరమూ కాలగమనముతోపాటు వికసించి,తనుకోల్పోయిన స్పృహ లీలగా కలలోనో,భాగవతస్పర్శలోనో స్వచ్చ ప్రకృతి పరిష్వంగములోనో పొందినప్పుడు సర్వేస్వరుని వునికి వూహలవెంట మనసు పరిగెడుతుంది. మళ్ళీ ఎమాత్రము భవలోకభావస్పర్శ తగిలినా వూహల వూపిరి పోయి శారీరిక శ్వాసలోకి తటాలున జారి మనసు శరీరంలొ లయిస్తుంది.ఇక గతంలో కానీ,ప్రస్తుతంగాని భవిష్యత్తులో కానీ,సశరీరుడైన మనిషి ఎంతటివాడైనా, భగవత్సాక్షాత్కారము సంపూర్ణముగాపొందిన విషయం ఇందమిద్దముగా చెప్పలేము. మహితాత్ముడంటే, లోకాన్ని ఆత్మగా గలిగిన స్వామి అని అర్ధము. అయితే, ఎల్లలోకాలూ,ఏకైకమేఅనీ,భగవాన్ లోకాతీతమనిన్నీ ఇప్పటికి తెలుసుకున్నాము. కీటకాలకన్నా మనము అధిక స్పృహ కలిగినవారమైన కారనాన పూర్వులు చెప్పినవి,గ్రహించినవీ,రాసినవీ మనకు కర కమలాలైనవి.అదృస్టవంతులమే. భగవంతుడి యొక్క దివ్యమైన స్పృహ కోసము ఆశ్రయించెదను. సుందర శ్రావ్య,భక్తి ప్రసూనముశ్రీమాన్ దాక్టర్ నల్లాంచక్రవర్తుల రాఘవాచర్యులుగారి శఠగోపగీతామృతంలోనిది."
No comments:
Post a Comment