Thursday, September 3, 2015

bhaagyamu

Sunday, 24 February 2013 at 07:22 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
కాలము కరిగిపోయె ఎండమావులయందు 
ఎంతటి మందభాగ్యము ఆన్వెషణకు ముందు
, నా రూపూ చూపూ మిసిమి పసిమి 
అమ్మా ఆయనొచ్చారు, (ఓరవాకిలి చూపు)
 ఆ క్షణం ఘనీభవించింది. ఈరోజు,
వెలిసిపోయిన వాయలు చీర,
జ్గ్నాపకాల మాసికల గతం 
గుర్తులు ఆగిపోయిన యానాన్ని 
ముందుకు నెడుతున్నాయి 
నన్ను చూసి,తనే నేననుకున్న 
స్వామి సాంగత్యములో, 
కష్టాన్ని,ఓర్చుకుంటూ
 కాయాన్ని మోసుకుంటూ,
బిడ్డల్లొ నా అందాన్ని,
ఆనందాన్ని పెంచుకున్నాను. 
నెరసిన నా కుంతలాలు
 వడిలిన నాదార్డ్యమూ 
వూర్వారుకు మివ బంధనాత్
 అని చివరి పరిష్కారానికి 
ఎదురు తెన్నులు చూసే తరుణంలో
 జీవితానికి ఇంకా అర్ధముందని 
తరించేందుకు మర్గాంతరముందని
 శంకర తీర్థం,రామానుజ ప్రసాదం
 లయించిపోయే భక్తి గాన మాధురిలో
 అమృత ప్రాయాలని గుడిగంటలు చెప్పాయి.
శఠగోపం స్పర్శకి ఆత్మ స్ప్రుహలోకొచ్చింది.
 నిండు జీవితానికి తన్మయత్వంలో
 ప్రపంచానికి నేనే "నాభి"అనికలగన్నాను.

No comments:

Post a Comment