Sunday, September 6, 2015

Saturday, 18 May 2013 at 21:12 UTC+05:30



.
నేనశరీరిని,ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నా,నేనుగా
కుడి ఎడమలని విడిచిన, విడి జీవాన్ని గమనిస్తున్నా.
గమనము ఎటోగ్రహించలేకున్నా,సశరీరిని కావాలని,
బొంద చుట్టూ గిరికీలు కొడుతూనే,
బందుగుల రవ్వడికి చలించిపోతున్నా.
పతనమో ,ఆయతనమో ,అయస్కాంతమో
ఏదో గుంజి గుంజీలు తీయిస్తోంది.
నావల్ల అనేదేమీ మిగలలా,మిగిలింది కదలదు
,తెరచిన కళ్ళెవరోమూసేసారు.
వచిన చోటుకే చచ్చినట్టు పోవాలి.
పుణ్యం పాపం ఎగ లాగుడు,
తాళధ్రుమ పరిభ్రమణము
అప్పుడప్పుడు కలలలో చేసేను
, నీడ తప్పిన నాకు తాడి దొరికింది.
చీకటి నిశ్శబ్దంలో తాడి దిగుదామంటే
అస్టదిగ్బంధనమయ్యిందే. కరతాళ కంపనము,
నాయనా' అని పిలుస్తోంది  కాని,
 పలుకుదామంటేదూరకుండా నోరు మూశారే
. ఏడుకట్లు,మూడు దింపుళ్ళు, అప్పుడూ చప్పుళ్ళే
. సందు దొరికితే దూరదామనుకుంటే,
పారి పోయేదాకా రోదనాలే
, చచ్చిపోదామనుకోలేదంటె
జీవికి చావు తప్పదంటున్నారు.
తప్పుడుమంత్రాలు చదువుతున్నారు.
ఇకతప్పదు తప్పుకోక
నన్ను నిలువునా అగ్నిదగ్ధముచేసి
అగ్నిదగ్ధాయ,అనగ్నిదగ్ధాయ అంటారేమిటి
ఎవరినడగాలి, ఎక్కడకెళ్ళాలి?
నాప్రెమేయమే లేకుండా తిరిగిపొతున్నా,
అక్కడ దీపమేలేదు దిక్కు చూసుకుందామనుకొంటే.
కొడకా,చమురేయరా, తెల్లారితే వల్లకాడికెళ్ళాలి.
మల్లీమరచిపోతారు,పర కాయ ప్రవేశానికి,కొంచం పుణ్యము
ధార పొయ్యెండిరా. మీరుణము తీర్చుకున్నాగా.

No comments:

Post a Comment