Thursday, 21 March 2013 at 00:00 UTC+05:30
నీడలు కత్తులు దూస్తున్నాయి.
నీడలు కత్తులు దూస్తున్నాయి.
పది వేల సూరీడులు దిగంధకారములో
కారాలు,మిరియాలు నూరుతున్నారు.
పారి పోదామంటే,నీడలు ఎదురు పడి దాడి చేస్తున్నాయి
. నిలువునా లేచి నిప్పులు కురిపిస్తున్నాయి.
చేతులకడ్డముగుండా చూస్తే దూరంగా
కుక్క గొడుగులు గుట్టలు,గుట్టలుగా తాటి బొందలపై
., గుత్తులుగా పీకి,పట్టాను ఏయెండకాగొడుగు.
తంతులు తెగిన తాటి మండలు, తాట వలుస్తున్నాయి.
అయ్యో నావీపు, నాబుఱ్ఱమొఱ్రో!
వెంటాడేనీడలు నవ్వాపుకోలేకపోతున్నాయి.
పరువెత్తి పారిపోయే నాబొంద,
మధ్యందిన మార్తాండాలమధ్య, మసి బారిపోయింది,
చీకట్ల కళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి.
దిక్కులు కాల్చిన సూరీడులు చీకటి నిశ్శబ్దములోకి జారారు
. నా వంటిపై వాతలు విరజిమ్మే వెలుగుకు
కొరివి దెయ్యాలు బొరియల్లోకి దూరిపోతున్నాయి
. చుక్కలనుండి నీడలు నెత్తివరకూ, ఎన్ని చుక్కలు?
ఎన్ని నీడలు?? నీడలు గొడుగుల అంచులై తోదుంటామని,
నా ఆత్మకి బాసటగా వుంటామని, మళ్ళీ ఆశలకి ప్రాణంపోస్తున్నాయి.
No comments:
Post a Comment