Sunday, September 6, 2015

Monday, 29 April 2013 at 22:43 UTC+05:30

మనసు సముద్రంలో అలజడి.
వూహలు ప్రాణం పోసుకోలెక
నీడల్లా,పారాడుతున్నయి.
నీటిపై గోటితో చిత్రం అలజడీ,
"కలల బొమ్మ" 'ప్రకృతిని పూజించడానికే,
అమ్ముకోనమ్మ,కాస్త తగ్గూ.
రచన పూర్తైన తర్వాత
మేలి మబ్బులపై ముద్రించుకో.
నెమలి కన్నెలు చూచేరు,
పురి విప్పి ఆడేరు
,కలికి కోయిలలూ,చిలుకలూ,
పాడి పలికి,పరవసించేరు.
నా చిత్తరువు,హత్తుకుని
పుడమి పులకించేను,నేస్తం.
ఒకప్పుడు పచ్చ బొమ్మలన్నీ
, అంటే,తరులూ,గిరులూ,
మైదానాల్లో మహారణ్యాలూ,ప్రకృతిలో
నా పూర్వీకులూ, పక్షులు,
గుండ్లకమ్మ నీళ్ళుతాగిపండ్లకొమ్మ గింజలు చిమ్మి
నీళ్ళల్లోకి తొంగిచూచే, మంచి బొమ్మలేన్నోరాశాయిట.
అప్పుడు రాములవారు, హా సీత అని
వాటన్నిటినీకూడ గ్రుచ్చి బిగియార కౌగలించారుట.
మిత్రమా, ఓ మానస సంద్రమా
నీటిపైనా,నేలపైనా,ఇంకా మబ్బులపైనా
,ఆకాశంపైనా బొమ్మలేయనీయి,
అమ్మ వడినిండనీయి.
నగ్నమైన నాప్రకృతిమాతకి
వంటి నిండా సింగారపు బొమ్మల
చీరలల్లి,పచ్చల పతకము
పూల వడ్డాణమూ,రాయిస్తాను.
ఇంక శలవీయి తల్లీ,నిద్రలో
ముద్రలు కలగనీ
అద్దకాలు చెయ్యాలి.

No comments:

Post a Comment