శ్రీవైష్ణవ సిఖామణిన్.
నా సందెహములు తీరునదెట్లు,
బిడియమను గడియ విడివడదాయె.
షస్ట్యబ్దములు నిండిననింకను కుబ్జనే.
గుణములెంచగలేను,గణ్యమెట్టిదో ఎరగను,
కన్యాదానం చేయ్యగవలె,కాలం మారినదాయె
చీకటిగీమున పూజలందు పెరుమాళ్ళు,
వేకువపాటాలకి లేచి, పాపలతో బడికెళ్ళేడివాడు.
ఇప్పుడు పిల్లలు తరుణులైరి.
అయిననూ,జ్ఞానము రాదాయె.
ఆసాంతము కెంగేలుగొని నడిపించిన స్వామి
నన్ను నాఖేదమునకోదిలివైచితిరా?
నా సహధర్మచారిణి నిత్యపూజాదురంధరి
పినాక పాణినీ,కోదండపాణినీ,
తప్పేమైనా చేశామా అని మొక్కి కన్నీటితో
కాళ్ళు కడిగి,తల వంపులయ్యేది. తల్లి కదా,
నేనయితే, తండ్రీ,తలవని తలపిది,
విలువల కల గన్నాము, తలపుల
మదిలోకొలువై విలువల వలిపెంబు,
తలజుట్టుస్వామీ,నిఖిలంబున నీవు
కొలువైన మదిన, సద్యోగిత గల
గీమున ఇచ్చుకొందు నా పట్టిని కనిపెట్టవె
శ్రీచక్ర రక్షిత,శ్రీలరారు, శ్రీవైష్ణవ సిఖామణిన్.
No comments:
Post a Comment