Thursday, September 3, 2015



ఎన్నాళ్ళయిందినన్ను నేను తలచుకుని?
కన్నీళ్ళయిపోయాయి;తల వంచుకు వాపోయాను
ఏమయిపోయానిన్నాళ్ళూ, కళ్ళముందే వెళ్ళిపోయిన వాళ్ళు
కలలోనైనా కనిపిస్తారేమోకానీ, విలువల రాహిత్యంలో విడిపోయినవాళ్ళు
ఎదురుపడినా, నుదురు చిట్లించి కలతల మసిబారిన భూతద్దంలో
తప్పులు తలుచుకు తల తిప్పుకుంటారు. అమ్మా నాయనా,
మమ్మల్ని మన్నిచండి అన్నదమ్ములమే,
మిమ్మల్ని పంచుకున్నాము. కంచాలు పంచుకునే తొందరలో
తొణికిన స్వప్నాలుగా మిగుల్చుకున్నాము.
కాలం చేసిన అమ్రుత మూర్తి అభాండాల తాకిడికి
మ్రుతమైపోయింది. అంతా అయిపోయిన తర్వాత,
చితి దగ్గర బిగ్గరగా తలుచుకుంతూ కళ్ళు తుడుచుకున్నాము.

Tiruvengalan Swaamin updated his status.
mallee niddarothaa నిజానికి గేలం వెయ్యాలి.
కానీ కళ్ళు తెరిచేటప్పటికే, నిసీధిలో నిజం కరిగి పోతుంది.
పగలు పరిగెట్టే ప్రాణానికి, ఎప్పటినిజాలే గుడ్డిగా కనిపిస్తాయి.
మెలకువలో నదులూ, నగరాలూ, నడుమ నన్నెవరూ, పట్టించుకోరు
. అడవిలో పూసిన గడ్డిపువ్వూ, కాసిన గుడ్డీ వెన్నెలా
నిద్రలో, నిజంగా వాటేసుకుంతాయి.
సర్పాలూ,సౌధాలూ,మామూలుగానే కాన వస్తాయి.,'
వళ్ళునిద్దరోతున్నా కళ్ళు చూస్తూనే వుంటాయి.
కొత్త వూరిలో దారులు తప్పినట్టు
కలల లోనూ గుర్తులు చెరిగి పోతున్నాయి.
చివరికి భయం గడ్డ కట్టి, ప్రాణాం కడబట్టి,కలవరిస్తాను.
విన్నవాళ్ళు,మామూలే పలవరించాడంటారు.
పగళ్ళూ, వూళ్ళూ,పగుళ్ళు, మనిషి కీ మనిషి కీ మధ్య
మసి బారిన నీరెండిన సెల ఏళ్ళూ వడిసెల కర్రతో విసురుకునే రాళ్ళూ.
నిద్రా లోకంలో నిలవరించేవి నాచేతుల చేతలే,నా చూపుల వంకరే
జరుగుతున్న విశెషాలని ఆత్మ అనవరతమూ
తూర్పారబెడుతూనే వుంతుంది,
అయినా మనసు వినక పొతే, కలలొ ఎవరొ
తెలీనివాళ్ళు చింత బరికెల మంత్రం వెస్తూనె వుంటారు.
నిద్రా ముద్రల్లో,సిక్షా స్మ్రుతీ,వెనువెంటనె
భరించలేనప్ప్డు ఎల్లగొ చచ్చీచెడీ మళ్ళీ మెలుకవ
చావు తప్పి కన్నులొట్టబోయి ఔను అందుకనే
కంసుడికీ, హిరణ్యకసిపుడికీ, నిద్రా లేదు,
మెలుకువాసంధ్యలోనే తెల్లారాయి.
నిద్రేనయం. భయమేస్తే, లెవచ్చూ,కలవరించచ్చూ.
కానీ, వూపిరి వుంతేనే పగలు.
లేకుంటే అందరూ, అపరిచితులే కావచ్చు.
నిన్న రాత్రి నే చూసిన నిద్రా నగరంలో,సౌధాలూ,
సౌదామినులూ,పురగోపురాలూ, నదులూ,సముద్రాలూ,
నరులూ,సహచరులూ, అలవాతయిన దారులూ,
ఏమార్చర్యమూ, పగటి చుక్కల కలభామినులూ,
పగలు లేని తల్లి థంద్రులూ, చుట్టపు చూపుగా
వారి పలకరింపులూ, వరుసగా కాకున్నా
వావి వరసలులెకున్నా నన్నదరిస్తూనే వున్నాయి.
మెలకువలోకి తన్ని నన్నేమారుస్తున్నయి.
నెనేమైనా తక్కువ తిన్నానా
మళ్ళీ భెతళాన్ని భుజాన్నేసుకుని నిద్దరోతా,

Sunday, 17 February 2013 at 12:31 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
పిల్లలు వాకిట్లో పడుకున్నారు. పెద్ద ఇల్లే,
నా గదిలో నే,వంటరిగా పడుకున్నా
గాలీ, వాన, చినుకుల చప్పుడు.
అమ్మ వచ్చింది,చవ్వడే కాలెదు,
పండేదిరా వాళ్ళల్లో,తడుస్తారెమో పిల్లలు,
తలుపులు తెరచి వున్నాయి చూసిరా నాయనా
బయటకొచ్చా,గోలగా పిల్లలు, లోపల కొచ్చారు,
పండేర్రా పిల్లలూ, నాన్నా ,బయట కెళ్ళింది,
వస్థూనేవుంటుంది, పరుగెట్టా బయటకి,
వుండమ్మా వస్తున్నానంటూ, తడిముద్ద తలా,పరికిణీ;
ముత్యాల్లా మోహమ్మీద చినుకులు
యెమే,నిండా పదెళ్ళులేవు, చీకట్లొ ఎక్కడికెళ్ళావే?,
భడవా లోపలికి రా,భరతం పడతా
నువ్వుండరా అదికాదు పద్ధతి, అంటున్నా అమ్మ,
దొరకబుచ్చుకున్నా రెక్క
ముందు నేవెళ్ళా వాన వెనకాలొచ్చింది,నాన్నా,
ఔన్రా దాంతప్పేముంది, చ్చెయ్యొదులు పిల్లది
అదిగో అమ్మా అదేవద్దనేది,వెనకేసుకురావద్దనేది.
పిల్లా గాలివానా ఇంట్లోకొచ్చేశాయి,
చొక్కా, గొడుగూ,లెకుండా బయటకొచ్చా. దారేదీ?,
అంతా నీళ్ళే,వళ్ళంతా కళ్ళు చేసుకు అమ్మ
"వెళ్ళవొయ్ లోపలికి,వాకిలి తలుపేసుకో,
లోగిలి అలుక్కో తర్వాత,తెల్లరితే వెలుగొస్తుంది.
కానీ అమ్మా నువ్వెళ్ళీపొకమ్మా,
ఎక్కడికెల్తా, మళ్ళీమళ్ళీ వస్తూనేవుంతా
వుందు మరి,పిల్లలు జాగర్త| "PANDoo
nee puttina ROJU KAANUKA"
iTlu mee naayanamma gaaru.

Sunday, 17 February 2013 at 11:22 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.

Tuesday, 12 February 2013 at 14:27 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
రాత్రి నేనేమై పొయాను?
నిద్రా నిసీధి లో పరకాయ ప్రవేశం చేసా
పగలు నేను కి పరిచయం లేని రాత్రి నేను
భయమేస్తేతప్ప తొందర పడనూ
ఇంకా నిద్రలో జీవిస్తాను,
ఇంటిల్లిపాదీ 'ఏమి వీడి మొద్దు నిద్ర?'
తెల్ల్లరింది లే అని తట్టి లేపాలి
కలనే నిజమని అచ్చం నాకనిపిస్తుంది
నిజం భ్రమా గా అనుకుంతాను
నిన్న కల నేటికి కొనసాగి
పగలు పాపాయినైపోతాను
వైవస్వతుడు శ్రద్ధా మనువాడి
ఇళ కలలొ నిజముగా సుద్యుమ్న్యుడు గా
పగలు ఒక ఒరలో రెండు కత్తులు.
కలలో కొట్టుకుపొయీ మెలకువ
తీరం చేరే నెమరేస్తే రాదె నాస్ప్రుహ

No comments:

Post a Comment