Sunday, January 18, 2026

 దినమున కొక గంట

పక్షమున నొక దినము
వత్సరమున యొక నెల
ఆత్మ విచారమే వ్రతమనిన
పూర్వ పర కాల వందనము
పక్షాంతర ఏకాదశి
ఇచ్ఛాపూర్వక వ్రత వారధి
మార్ఘఝి స్మరణ మనన జీవన విధి
బిగ్గర స్వరమున బెగ్గలింపు లేక
దగ్గర జెర వచ్చి తిమి కృష్ణ
తిమి రాంతక వేంచేయుము
`హృదయాంతః`పురమున
అని పా డెడు వ్రతమిది
వినము కనము వేరిట్టిది
వేసారివెదికిన పుడమిన
సంధ్య కు చేతు వందనము
దివారాత్రముల,పక్షముల
ఋతువుల ఆయనముల
. వేడెద
భక్తి జ్ఞాన తత్పరతల వృష్టికి
అనిశము కృష్ణ ప్రేమార్ధినై

No comments:

Post a Comment