ఎప్పుడో వేళైనది. చరిత్రకదా,
కాదు ఇంకను సమయమే
ఇపుడె చడ లేక కాలము గడప దాటేను!
కాలము చేసిన వారు గేలమునకు చిక్కిరి! ఈగలె కాదు యమ కీటక పాటక ప్రభువులు
సురతాగిన అసుర గణాచారులు అటునిటు
చాపచుట్టయి కట్టలుదాటుచున్నదె ఏరీ వీరులరచేతిన పాపరూకలుంచిన వారలు!
గెలిచి అలసి నిద్దురలో సేద తీరుతున్నారా?
నగర మేఖలమది ఖిలమైనది మైలయినది!
బట్టమాసి గట్టుతృంచబడి చేత బడైనదేమొ!
తెలుగుల వెలుగారినదా, ఏలనీ యకాల చెమట ప్రాణుల చెలగాటక మృత్యుహేల?
No comments:
Post a Comment