మరక మంచిదే, విమర్శ మంచిదే! మన ప్రగతికి గతి గమనాన్ని నిర్దేశించే ఎన్నికలలో మన బాధ్యత వ్యక్తుల ఎంపిక !ఈ ఎంపికలో వ్యక్తిత్వాలని నడిపించే సిధ్ధాంతాలు సిధ్ధాంత నిర్మాణం చేసిన ఋషి తపస్వుల శీలము సత్య నిష్ట ప్రామాణికమవుతాయి. మోడీ గారికన్నా వారిని నడిపిస్తున్న సిధ్ధాంతాలు ఘనమైనవి. జాతి ,జాగృతి , జన సమయోజన ప్రకృతి ప్రాకృతిక సద్యోభావన చక్కగా కలబోసి రచించిన మంత్రరసాయనము బి జె పి మౌలిక మూల తత్వం ! ఇయ్యది రామరాజ్య క్షాత్రయశో శోభితము! మోడీ గారు ఒక తృణం, కణం, పురుడుపోసుకున్న ఒకానొక సజీవ స్పృహ! హిందూ సింధువులో సహస్రకోటి బిందువులలో ఒకడు! నే నమృత వాహినినెం చుకుంటా! రేపటి రోజు ప్రవాహంలో దప్పిక తీర్చుకునెది ఈధర్మ స్ధలిలో జీవన యానం చెయ్యాల్సింది నా తరువాతి తరాలేగా! వారికి నావారసత్వంగా ఇంగిత ఙ్ఞానాన్నే ఆసిస్తా, ఇస్తా! ఈరోజు కామానికి ఈ పూట తిండికీ ఈజన్మ ప్రయాణానికీ కులధర్మాన్ని గుణ ప్రసాదాన్నీ నా వేదాంత సంపన్నతనీ కుదవబెట్టి కుక్కముట్టిన కుండనొప్పను ! ఇదిగదా నిత్యనవీనమయ్యే సజీవ ప్రాచీన ఆర్షహృదయము! ధర్మ వ్యాధుడూ సత్యహరిశ్చంద్రుడూ జాషువా రాధాకృష్ణపండితుడూ మన చరితలో మన వ్యక్తిత్వాన్ని శాసించే మేలు గీటు రాళ్ళేగదా!! 09\04\2019
No comments:
Post a Comment