from the torn pages
మనువాద' మనాదిగ వాదము కానేకాదు
తనువార జీవికన మెదలిన తలరాత
రాత తా' రాసినా భ్రహ్మ జిఙ్ఞాసన,
తనువును తగ నాల్గు భాగములుజేసె ,
నారాయణుడె నర పరివార' మని ఎంచి!
తగవాడును భుజములు ,తన'కాలుసేతుల,
కలసి. విడి వడి వడివడిన అధమము లయ్యె!
నవద్వారములు చెదిరి సమాజగోపురము
వ్రయ్యలయ్యె మనోగత యాత్మ,
పరశురామ ప్రీతియయ్యె చతురాంగ
కాష్టమున కాలెడి రావణప్రేతము పగిది!
స్మశానమున నెర్రెల చెంత దోగాడెడు
భూత పిశాచములు సశరీరులై
సమాజ కుల గళ తంతువుల జేరి
దిక్కుకొక ముక్క పగిదిగ దేహమును
దిక్కుమాలిన్చమొదలిడిన వైనము,
మనువు మున్నే కనుగొనునేమో ??
మనువా,.నీవన్నదదేమది మది యెంచిన దా
నవ నాగరిక జీవనము మును మున్నే
నీవూహన మెదిలినదా! భూతము
భవిష్యతమై జడవిప్పినడయాడునని
తపసులు పసువులు మసిలెడు
అడవి మనసది మెదలును పొదలందు
పొంచిన పులివలె కదిలీ కదలని కదళీ
వనమున మొలకెత్తెడి అరటి పిలకవలె .
చడిలేని చిత్తవృత్తుల చిత్తడి విచ్చలవిడి
మడియని మదియన్న వివరము
ముందే తెలుసా మనువా నీమనసుకు,
వర్ణములు కురచై కులములు పొడుగై
నీ వూపిరిపోసిన జనగణ గుణ విస్ఫోటనము
పశురక్కస మానసులను రాజ్యరమారవింద
గ్రుచ్చి బిగియారకౌగలించునని
అవనిన మరి వేరొకయవతారమవసరమగుని
ఓ సత్యవ్రతా మత్పితామహా నీవూహించి వుండవు.
No comments:
Post a Comment