జాతస్య మరణం ధృవమన్నట్లు చచ్చిపుట్టేదే
అయిదేళ్ళకో లేక సురారులు కొట్టుకుచచ్చాకో
ప్రజాస్వామ్యము పుట్టుకొస్తుంది పుట్టకొక్కు పార్టీలకోసం
దేశము ఎప్పుడోప్రేతకళపడింది,పుట్టిపెరిగినవీరులు
గిట్టుబాటు రాజకీయాలతో ప్రజలపుట్టి ముంచుతోనేవున్నారు
చట్టము చచ్చిబతికిన వీరాభిమన్యుడు,మళ్ళీమళ్ళీ
మామూలు మనుష్యులకోసము పుడుతూనేవుంటాడు
కానీ కౌరవుల్ని చంపడు,జైల్లోపెడుతూవుంటాడు
అంటే అందర్నీ కాదు ఒక్కశకునిమామని మాత్రమే
కానీ శకుని మామ పాచికలు ఇచ్చేవెళతాడుగా
మళ్ళీ జల్లికట్లూ,కోడిపందాలూ,ఆడేసుకుంటారు
దేముడు విశ్వరూపం చూపించినా ఓస్ ఇంతేనా అంటారు
అస్సలు వీరప్పన్ కంటే గొప్ప వాళ్ళెవరు,రాంగోపాల్నడగండి
వీరపాండ్యకట్టబొమ్మన్ కన్నా ఆటోశంకరేబెటరంటాడు
ప్రజాస్వామ్యంలోఇష్జ్ముటుందని అందరికీతెలిసిందే
No comments:
Post a Comment