Sunday, January 18, 2026

 SAMUDRAALA RAAMACHANDRAACHAARYA SWAAMY

చక్రాంగిత భుజముల పై భాసిల్లెడి అవనత వదనము
చతుర్వేదాంత కలిత ఉభయ విభూతులు విరాజిల్లెడు సదనము
జ్ఞాన సముద్ర వినయ అభయ ఆనందాది అనంత రూపమే
వాచస్పతులు స్కలిత వాచాలతను మన్నిమ్పరే !!
శ్రీమహాలక్ష్మీ సహిత నరసింహదేవ ఆత్మారామ వ్యవస్తితులు,
మన్నిన్తురు వెన్నుడి ప్రస్తుతిన నెంచిన నుడికార విస్తృతి
ఘన స్వామీ శారద నీరద వికసిత నిర్మలానంద
రూప స్వామీ నరసింహ ప్రభల కొలిచెద మీగృహమున!!
నాదు భక్తీ స్నేహ శీలములు మీ మన్నన పరిపూర్ణము కావలె!
కావలి కాచెద సంతసమున మీదు ఘన మనః మందిరమున
కొలువై విరాజిల్లెడు రాజీవ నేత్రుని రంగ ప్రభుని
రఘు రామ నారసిమ్హాది రూపముల విరాజిల్లెడు విమల మూర్తిని
ఆనాటి పోతన మేటి భాగవత భావనా జీవనమున
బమ్మెర నుండి క్రమ్మరు బంగరు భక్తీ శీలము పాలకుర్తికి జాలువారే
సోమనాధుని సంగతేమో గాని నాధమునుల శేముషీ రూప
వైష్ణ పుంగవులు సముద్రాంకితులు సముద్రాల రామచంద్ర ధీమహి
నేలకొండ పల్లి నేలగ నేగిరి, అట కంచెర్ల గోపడు చెర పాలై
రాముని గాన సుధల నలరించెనట నట రాజ విరాజ ఓంకారభవ
సంగీత సారస్వత సౌరభ సముద్రాల,నట గాయక పరిపోషిత గళ
జీవికయై తెలుగు వెలుగయ్య రాముని బాయక సంచిత
పుణ్య గణ్య రామచంద్ర స్వామి హృదయ పారిజాతము
భక్తిన వికసించె కానక నే కనుగొంటి జామాత నీ ఇంట
నాదు సంచిత పుణ్యవశమున కావవే స్వామీ
కారుణ్యమున కడు దీనుడ ఘన ప్రాపత్తి ప్రసాదమునిచ్చి
నేరుతు వినయ భాషణమ్మునిక విమల మనస్కుడనై
రాముని యాన నాదు నాలుక చివర
వినయ వివేకములు స్తిరముగా నిలుచు గాక
నామదిన రామ దాసులు సతతము
దిన దిన ప్రవర్ధమానమౌదురు గాక
నారసింహుడు నన్ను జ్ఞాన ప్రసూనమోనర్చి
తనమ్రోలన నిల్పునుగాక !!

No comments:

Post a Comment