Sunday, January 18, 2026

 DEc,2017

బాటలు పరుపనెంచిన రాజస ధీమహీ
నగుబాటగు కొలువున చెలికాండ్ర చేరదీసిన
కదనరంగమిది కర్మవీరుల చరణ పారణముచేకొనవలె
నారాయడు నట్టింట ముంచక మున్నె
కామ్యక ముష్కురులు కలుష దృష్టి తగిలించగ మున్నె
లేరె నీ అండగ నిఖిల కోటి తెలుగు బిడ్డలు
రైతులు,స్వేదమునందముగ చిందించి
ఆరుగాలము అవిశ్రాంతముగ సేవజేసెడివారలు
నిరుపేదలు నిరుద్యోగ సద్యోమతులు
నినుచేర త్రోవ లేక యల్లాడెడు తమ్ములు చెల్లెండ్రకు
పంచుము నగరవాఖిట తోరణ పారణ దీప శేవల
కర్మ విధిన కడుపు నిండగ బువ్వపెట్టిన
కర్మ ధర్మపరిచర్యకు కరచరణములు కారెవారు
ఎవ్వరీ తమ్ములని సందేహించక
ప్రొవైన నిలువు కొలువు నిర్భాగ్యులకన్నమిడగదె
నేర్తురు వారు నగర నాగరిక శ్రమదానము
కడు ప్రేమన భక్తిన తమ తనుమనధనముల పూర్వకముగ
అయ్యా విధముల రోతగు ధనకామందుల వీడుము
బేహారులు మ్లేచ్చ కిరాతక వారుండములేల రావలె
మన సంపదలనేల నేల పాల్జేయవలె
మన ఇంటిని మనము చక్క దిద్దిన మనకి గారవము కాదె
జాపాను జలబంధక సీమలైన ఇంగ్లాణ్డు అమైరికా
తమతమ నెలవుల కొలువులు తమవారిచె నిర్మించగ
మనకేల పరనిర్మిత మతి పరభాగ్యచింతన
తరుణమిది నిర్వ్యాపారా గణముల నుద్దీపించి
నవ నిర్మాణ యగ్జమున హోతలజేయుట
మేల్కొనవ రాజ ధీమహీ చంద్ర చూడామణీ
తెలుగు నాట నిలచిన ఆంధ్ర బ్రాహ్మణ
రెడ్డిరాజ కమ్మ కాపు రోష ధీర చైతన్య శిఖవి కాదె
తరతరముల జాతీయత నిలవెట్టిన హరిహరాది బుక్కవి కాదె

No comments:

Post a Comment