మొదలూ తుది వెతుకుతున్నా 08 NOV 2019
తప్పదని తెలిసే తొందర!
పెరుగుతూ దారెంచలేదు!
మావిలోంచి మాయలోకి ముందుకే!
వెనక్కితిరిగిచూస్తే చీకటిభయమేగా!
కళ్ళూవళ్ళూ ప్రాకారంచుట్టూనే!
గుడిలోకి నడిపించే కళ్ళుతడిమే
మేదిని, అంతా ఋతువర్తని, అయ్యో
ఋజుమార్గం చూపే తల్లి 'నిత్యావర్తని',
తండ్రి 'యక్షుడూ,అక్షయ బిక్షకుడూ'
అర్ధాంగీ, 'అన్యాపదేశ అన్యాంగీ'
కళ్ళేమో,కళవళపెట్టే 'హ్రస్వ సంధులు'.
దీర్ఘమో సంకుచితమో సరళమో
సంశ్లేష, ఆత్మ చోదిత 'మనోవిచారం'!
కాని, మాదక మోదక చిత్త భ్రమ 'వ్యసని'!
కల్లు కోతి తెలియక త్రాగచ్చు!
మనిషి కళ్ళతో, స్పర్శతో, జిహ్వతో,
చెవులారా మనసుతీరా, తమిన గ్రోలడూ!
నా మానవ రూపంతో, వెతుకుతూనేవున్నా!
పదివికారాలు కలసి రధమైతే
సత్తూ రజస్సు తమస్సు తోలితే
మామూలు మనూష్యులమయ్యాము
కానీ రాముడినెంచే పని ముంచు కొచ్చేది,
చచ్చే ముందైతే ఎలా?, ఇచ్చకాలజన్మ,
సత్య పరీక్ష మరచిపోతూ వస్తుంది!!
No comments:
Post a Comment