Sunday, January 18, 2026

 ఆదరణ , ఒక గుర్తు తలుచుకుంటూనేవున్నాను

అమ్మలాంటి వాళ్ళన్నంపెట్టినప్పుడల్లా
మాకో బంగారు వదినె,అచ్చమ్మాళ్ళంటారు
ఆవిడెవరంటారా, అయితే కొంచందీర్ఘమైనా,
ముందు సింహాద్రి బావని తల్చుకోవలసిందే
67- 71 దాకా శలవుల సందడి అనపర్తేగా
అక్క త్యాగయ్యకృతిలో సీతమ్మే నండి
శ్రీహరీ జగద్రక్షకఅని ఊపిరూపిరికీఅనేవారూ,
బాలాజీ చెరువెదురురంగాచార్యులుగారమ్మ
పట్టెనామాలస్వామి పరమ దయాళువు
అనపర్తి మార్కండేయహోటల్సందు అదే
పెద్దాపురంబావగాస్ధిరపడ్డ సత్యం చిరునామా
ఒకప్పటి మాట 69లో ఎడ్రస్ కొండూరి వారి వీధి
అచ్చమ్మాళ్ గారిల్లు, నల్లమందుసందు
మాధవసదన్ , విద్యానగర్ సింహాద్రమ్మగారిల్లు
సినిమాచూడాలంటె సింహాద్రిబావకన్నా చనువు
మావదినె అచ్చమ్మాళ్ దగ్గర ఐద్రూపాయిలే,
తక్కువేంకాదు, నాకు శేషగిరికి, బంగారుగాజులు
సినిమాలో పాత్ర బంకించంద్ నవలల్లో పాత్ర ఆవిడ
అదుగో ఆకాలం తర్వాత ఒక రోజు అక్క పెళ్ళి సంబంధం,
ఆనిమిత్తం, వదినే నేను,రంగడుగారుఅంటే STO
సింహాద్రమ్మగారి తమ్ముడు ఆయన సతీమణి సుశీల గారు
వారింటికి వెళ్ళాం తర్వాత రోజు.....,.,,,,,,,
ఆమె ఆదరణ ఆత్మీయత శబరి మాతను పోలినది! 76 లో వారింట సాపాటు చేసిన సందర్భము అపూర్వము, మధ్యలో కరంటు పోయింది,. మండుటెండలు! గొంతులో అమృతంలాంటి పప్పుబువ్వక్రొత్తావకాయ నంజుడూ, కొంచెంపొలమారింది,! ఆవిడ ఏమాత్రమూ కొత్తనక తలమీద తట్టి మంచి తీర్ధమిచ్చారు. కొంగుతో వీవన చేశారు, సిగ్గు పడి , అమ్మా మన్నించండి, అని అర్దిస్తే చిరునవ్వు ., మరపురాదే, మనసు వికలమైనదీ వార్త విని. అచ్చమ్మాళ్ వదినతో ఈ వీషయం చెబితే అవిడ మరో మెరపుల చిరునవ్వు. ఎంతటి అదృష్ట వంతుడినండీ, వారింట ప్రేమామృతమారగించాను., ఎంతటి దౌర్భాగ్యమండీ, ఏమాత్రమూ మళ్ళీ కృతఙ్ఞత చూపించుకోలేదు. అచ్చమ్మాళ్ళు గారి విషయంలోనూ ఇలాగేజరిగింది. కనీసం ఆవిడ పరమపదించిన వెంటనేవెళ్ళి భుజంపట్టగలిగాను! శ్రీమన్నారాయణా శరణు!అక్కఆత్మ పరమాత్మనుచేరుగాక! మీకు కుటుంబానికి అమ్మగారికి శ్రీరామ రక్ష! దాసుడు. సత్యం
బాధా తప్త హృదయంతో 27 APRIL 2020

No comments:

Post a Comment