Sunday, January 18, 2026

 పూల విరిజల్లు కలల హరివిల్లు

విచలిత మానస దరహాస విలాసం
ఆత్మానంద కందళిత విభ్రమం
హరి రిహమే మేఖలా బంధమే
కుంద ముకుంద తుషార వర్ణ సంవర్ణమేp
పాల గోపాల మాధవ లీలా సంలీనమే
ధరాధర చరాచర పరాపర దామోదరమే
ధగధ్ధగాయ స్ఫురత్ స్ఫురాయ విరాజితమే
రాధా మనోహరమే మాయా మానుషమే
కుబ్జ లబ్ద సిధ్ధ బధ్ధముగ్ధదగ్ధ మనః పరిపాలనమే
కటశకటవికట నట పటుతర న్యాసవిన్యాసమే
మనోయవన పూతనాచేతక గాంగేయగాన ఙ్ఞానమే
ఝురీపాత గీతా నిర్గళితగళగురుర్గురు జగద్గురు కృష్ణార్ణవమే
కృష్ణం కలయ సఖీ సుందరమ్ కలౌకృష్ణం కలయ సఖీ సుందరమ్

No comments:

Post a Comment