Sunday, January 18, 2026

 

Satyanarayana Charyulu Maringanti   fjrom the torn pages

 
Shared with Friends
కనులు రెండును చక్షువులండ్రు సంస్కృతమున
చక్షువులుగొనవలె విచక్షణాదిక దృష్టి
ఇష్టములుకర్మాంగచేష్టిములుగాన మనసుకు
మరి కష్టయుతమౌ పాలను నీరును వేరుచేయగ
సరియగు గురు శ్రుషూష లేక తమందు తత్వమరయక
శరీరభావన ఆత్మభావన కలసి ద్వైదీభావనయగు
ఏది మార్గమను ఘోష మనసుకు తట్టదు సులువగు
కర్మాంగములు దారిచూపెడి స్వల్పములగు క్షణములు
ఘనప్రేంఖణ అగ్నిజ్వాలలై ఆత్మను హరించును
గృహబంధిత ఆత్మ కృశించి తన తనువున నీరసమౌ
దీపము కొడిగట్టిన చందమున నూరు వత్సరములు
తీపరమున తొందరగ తీరును జన్మ తెరగు మరచి
ద్వైత భావన కడు స్పష్టమయ్యు విపరీతము
అది విడి విడి యగు కణములకు విడదీసిన తంత్రమునిచ్చు
కణజాలము ప్రాణముండియు ఆత్మవిదూరము
అద్వైతమన పాత్రయందు నిక్షిప్తమైన అమృతము
పాత్రతలేక అమృతము నిలువజాలదు
అటులె శరీరము సతతము మలినమగు భిత్తి
అట్టిది మీమాంసాది విచక్షణన సుభ్రపడదది
మానవజన్మ కడు దుర్లభమండ్రు
బ్రహ్మ జ్ఞాన మరయుట కడుంగడు కష్టము
ఎందుననగ రాగ మతిశయించు దేహత్రాణన
మెదలనీదు మనహ్పరిపాకమును మనహ్
పరేంగితాది ఘన జ్ఞాన విషేషములు
తాత్వికత సాత్వీకత కలసి స్వాధీనాత్మకమగును
ఆత్మ మిగుల జడమయ్యు జటిలము కాదు కనుగొనిన
మనసు ధ్రవీభూతమగు పరిమళ జ్ఞానము
ఆత్మప్రదీపనమగు అది చీకటిన వెలుగెడి
కడు వినయప్రకాశ వివేక విచారము
ఆత్మ శరీర భావననుండి విముక్టమగుట
హింసకాదు వుథ్థానము. ప్రాకృతిక ప్రయోజనము
ఒట్టిపునరుత్పత్తికాదు వుథ్థాన ప్రకాశమది
నిగ్రహ స్వాంత శాంత ఆత్మ ధృతిన వ్యక్తమగు
\వివేకము నిజముగ చూడామణియే శిరమున ధరించిన
జన్మమున వివేకము సంచితము చేయు పుణ్యము.

No comments:

Post a Comment