సిరా రాతలు......... జన్మ రోజూ తరిస్తూనేవుంటుంది. చీకటి వెలుగూ స్మృతి విస్మృతి మధ్యనుంచి మనిషి రెండువైపులా ప్రయాణంచేస్తూనే అస్తమయంకేసిక్రమంగా జరుగుతాడు. జంతువుల జన్మ తిరస్కారాన్ని వాటిమరణ సమయ నిర్వేదంలో ఆలాపనలో చూస్తాము. భావ వేగం సన్నగిల్లి నప్పుడు స్తబ్దత కేసి జీవి జరుగుతుంది. నాడులుకృశించి కళ్ళకి, కాళ్ళకి చలనంమందగించినప్పుడు గతంలో మనిషి జీవిస్తూ వర్తమానంలో నీడల్లో క్రీ నీడైపోతాడు! భవిష్యత్తును మరపు తెరపులుగా అనుభవిస్తూనే చివరకి మిగిలే అనుభవం గుర్తైనప్పుడు మళ్ళీ వర్తమానంగతంలోకి జారిపోయే ప్రయత్నంచేస్తాడు. ప్రతి చిన్న అనుమానమూ పెను విచారభార మవుతుంది.ధ్యానంతో ఙ్ఞానంతో నిరా లోచన నిరపేక్షిత్వమూ సంపద చేసుకుంటే క్రమక్రమంగా పుణ్యతీర్థ సేవనంతో అంతరోన్ముఖుడై సునాయాసమరణంచెందుతాడు. ఇది మాతండ్రిగారి ప్రయాణం చేసిన తీరు! ఐతే అంతర్గతంగా రాగద్వేష కోపతాప లక్షణాలు ఆరోగ్యపుటంచుల్లో వుండంగానే శమింపజేసుకోపోతే, శారీరిక యాతన ఆశ నిరాశ, అశక్తతత న్యూనత వైరాగ్యము కన్నీరుల మధ్య అంగిక, మాంస, శ్రవణ, దృశా స్పర్శాదుల తీవ్ర సంచలిత పీడలతో హృదయం చివికి చివికి శరీరము ఛిధ్రకృధ్ధమై మరణము పొందడమూ గమనిస్తాము. పునర్జన్మ గురించి మన పురాణ సంగ్రహాల్లో చెప్పబడిన
No comments:
Post a Comment