శాపములిత్తురు శమదమములవెచ్చించి
శాపగ్రస్త అగుదుడు పుణ్యశీల.,తను
శ్రమమున పడి వికృతుడైనను కర్మదూరుడౌ
జ్గ్నాన లేశస్పూర్థిన నిర్ణయక్రియలాచరించు!
పిదప ధ్యానమగ్నతన పతితపావనుడౌ!
లోతున పాపములు చెలగును,కష్టతరములయ్యు,
పుణ్యకార్యములు తోచునాత్మకు!
కాని మనోబుద్ద్యహ్మకారములు
చెప్పును వేరొకొండు విషయ వివరములు
అవి ప్రీతిన దేహము స్వీకరించు
చేతనకు సారధి దేహమయ్యు
పరివర్తన ప్రభాసమునకు జేర్చునదాత్మ!
బూద్ధి వివేచనమున సజ్జన సాంగత్యమున
సద్గురు సుశ్రూష వలన సాత్వికాహార సేవనము వల్ల
ఎన్నగరాని భక్తివల్ల ఆశించని సేవవల్ల
నిరపరాధ క్రియా చర్యలవల్ల
లభించు నాత్మకు సాధ్యత సాధికారత
తనువున, మనముపై, బుద్ధినందు మరి సాధనయందు
22 02 2018
No comments:
Post a Comment