[10/28, 5:50 PM] Maringanti Srilakshmi: పాలకొల్లు ప్రయాణము. విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా.
[10/28, 5:52 PM] Maringanti Srilakshmi: కంట్లో బొగ్గునలక పడింది. అమ్మ కళ్ళు పెద్దవి చేసి కొంచం తనచీరకొంగు కొసతో నలక తీసింది. కొంగు ఉందా చేసి కాపడం పెట్టింది. తర్వాత అమ్మ అక్క ' వీడిని ఓ కంట కనిపెట్టాలని అనుకున్నారు.ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది. నాన్న గారు మంచి నీళ్లకోసం ప్లాట్ఫారం మీదికి దిగారనుకుంటాను నాకు కూడాబడడము అలవాటు కదా. కానీ పెద్దక్క కనిపెడుతూనే ఉంది. చెయ్యి పట్టుకు ప్లాట్ఫారం మీద బొమ్మల బండీ, బన్నులబండీ జనాలవైపు నా ద్యాస మరల్చింది. నాన్నగారిప్పుడు వచ్చారో ఎంతెచ్చారో గాని పెద్దక్క అమ్మ సత్యాల దృష్టి నామీంచి మళ్ళింది. అమ్మ చిన్ని, శిరీష్ లతో బిజీ అయ్యుంటుంది. వూరిపేరు నాకు తెలీదు కానీ గబుక్కున రైలు దిగేసాను. దిగే వాళ్ల తోబాటు ప్లాట్ఫారము మీదికి దిగజారాను.ముందుకు నాలుగడుగులేసాను. రైలెళ్లి పోతోంది. తరవాత నేను ఎత్తు బల్ల మీద కూచున్నాను. కానీ బఠాణీలు తింటున్నాను.ఈలోపు ఒకాయనొచ్చాడు. ఉంగరాలజుట్టు కళ్ళజోడు నల్లగా ఉన్నారు , ఆయన వెనకాల నాన్నగారు. గుర్రం బండి మీద నేను నాన్నగారు, చిన్నన్న గారు సైకిల్ మీద. (చిన్నన్న గారిది ర్యాలీ సైకిలు. దీని గురించి మళ్లీ చెబుతాను. ) పాలకొల్లు చేరాను. నా మొదటి వంటరి రైలు ప్రయాణం ఆరేళ్లప్పుడు మొదలయ్యింది.ఎంత గమ్మత్తు, వెనకాల చిన్ని శిరీషు లు చిన్నవాళ్ళు.పెద్దక్క సత్యము పెద్ద వాళ్ళు. అమ్మ నాన్న జేజలు . ఇంతమందిని వదిలి వంటరి ప్రయాణము అప్పుడే మొదలయ్యింది. ( ఇప్పుడెంత విచారించేమి లాభం, అమ్మ లేదు, నాయనగారు లేరు, పెద్దక్క లేదు. సత్యమున్నా మల్లెతీవ లల్లుకొన్న కదంబ వృక్షమై వూర్ధోన్ముఖయై వర్ధిల్లుతోంది. చిన్ని తన జీవన సౌరభాన్ని బావగారి ఇలవేలుపుల పరిచర్యలో అంకితం చేసింది.తన ప్రాపుకోసమెళ్లినా తన వసంత కుంజ మంజన క్రియలో అనవరతయై శోభిల్లతూ కుశలమడుగుతుందేమో. శిరీష
[10/28, 5:52 PM] Maringanti Srilakshmi: శిరీష కుసుమ పేశల మీమె సుకుమారము. పుట్టిన క్షణమున ఎగ్మోర్ ఆసుపత్రి నర్సమ్మలీమెను అరచేతుల నెత్తుకున్న ఒత్తుకునునేమో యని గుసగుస లాడి రట. ఈమాట ఈనోట ఆనోట విన్నది కాదు, పెద్దత్త, అంగల్లు గారు, అనపర్తిలో, సింహాద్రి బావ గారింట, ముచ్చట్ల మధ్య యన్నమాట.చిన్ని గురించి అచ్చమ్మాళ్ వదిన 'కళ గల పిల్ల రాముడు మామ మూడో కూతురు, అని బంధువర్గం లో ఉటంకించేది .) సరే , ఇక నా కథలోకొస్తే, పైన ఇరువురు, క్రింద నిరువురు. తరువాత నేనే పెద్ద నయ్యాను. పాలకొల్లు లో ముందు పాక ఇన్టి లోనున్నాము.
[10/29, 1:59 AM] Maringanti Srilakshmi: కలితము సంకలితం కావచ్చు.కానీ చరిత్ర కాని గతం సంగతులు పూసగుచ్చితే చెందిన భాగ్యరేఖ ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకఘట్టం,దాని చివర ఒక చీలిక ., అటో ఇటో ఎంచుకోలేని సందిగ్ధత, ఔను ఆటే అనిపించే వత్తిడి, లేదా పోరు , ఊహల ఊసులకి ఒద్దిక లేని బుద్ధి తోడ్పాటు, బహుశా బ్రూటస్ నీ కూడా ప్రభావితం చేసి కాని వుండచ్చు. నాకు అమ్మా దేవతే, వీధిలో గోడ మీద అంజలి బొమ్మ దేవతే కానీ చీకటన్నా చిమ్మెట అన్నా భయం. దశావతారాల్లో కల్కిచెడ్డ వాళ్ళని శిక్షించడానికి వస్తాడని నాయన గారి భాగవత కథాగోస్తి లో విన్నాను. వెస్ట్ మాంబళంలో ఉన్నప్పుడు భారతంలో ఆదిపర్వ పారాయణం జరుగుతోండేది . Ok
[10/29, 2:32 AM] Maringanti Srilakshmi: ఒకఘట్టం,దాని చివర ఒక చీలిక ., అటో ఇటో ఎంచుకోలేని సందిగ్ధత, ఔను ఆటే అనిపించే వత్తిడి, లేదా పోరు , ఊహల ఊసులకి ఒద్దిక లేని బుద్ధి తోడ్పాటు, బహుశా బ్రూటస్ నీ కూడా ప్రభావితం చేసి కాని వుండచ్చు. నాకు అమ్మా దేవతే, వీల. నాయనగారు నక్షత్ర దర్శనానంతరం కధా గోష్టి మొదలెట్టేవారు.నేను ఆకాశం కేసి మళ్ళీ మళ్ళీ చూసి వచ్చేశాయని ఓసాయంత్రం మంచమెక్కి అటకమీద భారతగ్రంథాన్ని దింపే ప్రయత్నంలో మంచమీంచి కింద పడ్డా. చెవ్వి పైన మచ్చ యిప్పటికీ అలానే ఉంది. వైద్య వివరం గుర్తులేదు. పంచదార వేసి వుండచ్చు. ,(పాలకొల్లులో కామేశ్వరమ్మ గారి బుర్ర మీద పత్రం పెట్టి ఆవిడ మనుమరాలు మోది నప్పుడు నాన్నగారు సవాసేరు పంచదార ఆవిడ. బుర్రమీద పోశారు.
[10/29, 2:44 AM] Maringanti Srilakshmi: ఇక్కడ రెండు విషయాలు. కామేశ్వరమ్మ గారు తల బోడి, మనుమరాలికి పిచ్చనుకునేవారు .ఈ సంఘటన మేము పాకలోంచి కామేశ్వరమ్మగారి పెంకుటి ఇంటికి మారిన కొన్నాళ్ళకు జరిగింది
[10/29, 2:47 AM] Maringanti Srilakshmi: పాక ఇంటి గురించి., ఒక పెద్ద హాలు గది, ఉత్తరదక్షిణాలుగా గుమ్మాలు. ఉత్తరం పంచ అవతల వీధి.దక్షిణం గుమ్మాన్నముకుని పడమరకేసి వంటిల్లు. అమ్మ పొయ్యిమీద వంట చేసేది. పెద్ద కుంపటి, చిన్నకుంపటి ఉండేవి. నేను కుంపటి అంటించినపాటు బాగా విసిరేవాడిని. ఎర్రటి రవ్వలు ఎగురుతుంటే చాలా థ్రిల్ కలిగేది. చూస్తుండగానే పప్పు ఉడికేసేది. బొగ్గులేలోపు చతికిలబడితే ఆ మరికాసిని వేసి సరిచేసేది.
[10/29, 2:57 AM] Maringanti Srilakshmi: చిన్నాన్నగార్ని శేషు చిన్నాన్న గారని పిలిచేవారు. పిన్ని రాజేశ్వరి . తాతగారికి పేరు నచ్చేది కాదు. రాజేశ్వరనేపేరు వైష్ణవులు పెట్టుకోవడం ఆక్షేపణ. అంటే అమ్మా వాళ్ళుఆర్లదుకొంటేంటే మాకేవిషయాలు తెలిసాయి. బాలా మాటలు తెలిసి తెలీలో విని అసందర్భంగా మాట్లాడటం ఆనక చివాట్లు నాకలవాటు
మా అయినది రెండో సంబంధముట. అంటే మొదటి పిన్ని కాలంచేసింది. ఆవిడ కిద్దరు అమ్మాయిలు. పెద్దది పాప, రెండోది చెల్లెమ్మ ( ఇప్పుడు కొత్తగూడెంలో ఉంది) తరువాత పాపాయి పుట్టడము ఆవిడ కాలం చేయడం జరిగాయి. వాళ్ళిల్లు పాకింటికి ఎదురే . వాళ్ళింట్లో రేడియో ఉండేది. పాటలు వ్యవహారం మాకు కొత్త. నేను వాళ్ళతో కలిసిపోయినా నాకు తెలుగు సరిగ్గా రాక వెక్కిరింటలపాలయ్యేవాడిని. నన్ను బాను బదులు బర్రూ అని పిలిచేవారు. అక్క సత్యం కొంచం దూరంగా ఉండేవారు. అక్క ఇక్కడ 9 1o పదో చదివేది. సత్యం వాడి కొచ్చేది కానీ క్లాస్ సంగతి తెలీదు.
[10/30, 12:39 AM] Maringanti Srilakshmi: పొడుగాటి జీవితంలో మంచి రోజులంటే విచారమెరుగనివి. రేపంటే కలల ఊయలో సోలి చప్పున తెల్లారే మరో రోజు.పాలకొల్లు బాల్యచేతనకి పూల పల్లె.. అవును పూలపల్లి దగ్గరే ఉండే వాళ్ళం. ఆపేట పేరు శంభుని అగ్రహారం. ఒక పాడుబడ్డ గుడి చుట్టూ విశాలమైన ఆవరణా చేతికి అందే పొట్టి కొబ్బరి చెట్లు. ఇల్లు దాటి ఎడమ చేతివైపు వంద గజాలు నడిస్తే కుడివైపుకు రోడ్డు మళ్ళుతుంది . తిన్నగా సన్నటి కాలి బాట కొంచంవంకరటింకరగా తిరిగి పిల్లకాలవ పైన కొబ్బరి మాను వంతెనకు దారి తీస్తుంది. దాటితే వారి పొలాలు. కుడివైపు తిరిగిన తరువాత ఎడమ పక్క శంభునిగుడి, నాలుగడుగులవతల నేను ఒకటో క్లాస్ చదివిన బొండం పంతులమ్మ గారి బడి. దాటుకు కొంచం ముందర తారు రోడ్డు. తారు రోడ్డు దాటితే లజపతిరాయ్ పేట . నాలుగు వరుస రోడ్లతో పెద్ద నివాస సముదాయము. అక్కడ నానగారి చిన్నాన్న గరుండేవారు. పక్కనే పోస్టాఫీసు. .నన్ను బళ్ళో మదరాసు నుంచి వచి కొద్దిరోజుల్లోనే వేసేశారు. నాకు పంతులమ్మ గారంటే. చాలా భక్తి ఉండేది. ఆవిడ పేరు లీలా వతి.కానీ చెల్లెమ్మ పాప అందరూ బోండాం టీచరనీ అంటే నేను చాలా ఊదుకునే వాడిని. సత్యం 4 గో క్లాసనుకుంటా .
[10/30, 8:29 AM] Maringanti Srilakshmi: Hello yesterday I had been to a fascinating world of Siberian part of Russia. The scenes were altogether different to rest of land scopes. The versal lake with a narrow gauge line the url mountain hot springs, the piller like long columned stones of steel mountains the line some forests of sparsely sprout ferns, the wider canyons by of the sledges and the fewer tribes struggling for warmth and survival.
[10/30, 8:31 AM] Maringanti Srilakshmi: You have to see how they make the ground for raising a tent. They are not igloos but so like to keep them warm.
[10/30, 9:16 AM] Maringanti Srilakshmi: I don't know where in Russia you were and whence it was, but the Siebirria is altogether a different world. The coal explorations made a venture into tundra land and incidentally their first bargain with nature was salt from bursal lake, a beautiful sledge like narrow gauge line was the spectre.
[10/30, 9:19 AM] Maringanti Srilakshmi: And a long long stone bone road speaks volumes of cruel endeavour
[10/31, 12:11 AM] Maringanti Srilakshmi: పాప చెల్లెమ్మ పెద్దక్క హై స్కూళ్కి వెళ్ళేవారు. చిన్నాన్న గారింట్లో ధాన్యం బస్తలుండేవి. కాసిని బియ్యం ఇచ్చేవారు. ఆ ఇవ్వడము వరస అమ్మకి నచ్చేది కాదు. బుడుగు భాషలో నాన్న గారికి రోజు ఏదో విషయమై ప్రైవేట్ తప్పేది కాదు. నాకు నిద్ర కాబట్టి ప్రత్య క్షము గా తెలీదు.అక్కకి సత్యానికి తెలీదు. నానగారి వీపు పైన బరుకులుండేవి. బూచి రక్కిందనే వారు.నాకు దయ్యాలంటే చాలా భయం. ఇంటి వెనకాల జీబు చెట్ల వెనకాల బోదె కాలవలో చాలా కప్పలుండేవి. రాత్రయితే వాటికి తెల్లవారేదేమో. బెక బెక సంగీతం, దానికి తోడు కీచు రాళ్ళ రొద. రాత్రయితే చాలు భయం సేవుల్లోంచి మనసులోకెళ్ళిపోయేది. అమ్మ ఆంజనేయ మంత్రం చెప్పింది. పూర్తిగా రాకపోవడం మూలాన నా భయం పూర్తిగా పోయేది కాదు.దుప్పటి కప్పుకున్నా భయం తగ్గేదికాదు . నిద్రకి ముందు నాన్నగారి పక్కన అనేదేమీ ఉండేదికాదు. బోంతో చాపో అంతే...ఐతే నాకు కల్యావతారం కధ కలలోకి వచ్చేది. పెద్ద గుర్రం మీద కల్కి కత్తితో వీధుల వెంట తిరుగు తున్నట్టు ఉండేది.
[10/31, 12:16 AM] papai 2nd Number: పాపం అమ్మ, మద్రాసులో ఇండిపెండెన్సు నించీ, పాలకొల్లులో డిపెండెన్సుకి వచ్చేశారు!
[10/31, 12:27 AM] papai 2nd Number: నాన్నగారికి, అమ్మకీ మద్రాసులో దర్జాగా ఉండడం అలవాటు - పొలాలకోసం వచ్చి చాలా పాటు పడిపోయారు
[10/31, 12:37 AM] papai 2nd Number: చిన్నతనంలో మనం జీవించే జీవితం పరీక్షలాగా, గొప్పవారి జీవితాలు పఠించదగ్గ పుస్తకాల్లాగా, పక్కవారి జీవితాలు సరదాగా చూసే ప్రయాణాల్లాగా కనబడతాయ్ - ఒక వయసు వచ్చాక, ఇదంతా అలుక్కుపోతుంది - ఏది పుస్తకంలోచి నేర్చుకోవాలో, ఎందుకు పరీక్ష రాయాలో తెలీదు, అయినా ముందుకు పోతూనే ఉంటాం.
[10/31, 1:05 AM] Maringanti Srilakshmi: చిన్న పాము : వర్షాకాలమొచ్చింది . పాక చోరువెంట నీళ్ళు కారడం కళ్ళార్పకుండా చూసే వాళ్ళము. పాలకొల్లొచేసరికి చిన్ని శిరీషుల పరిచయం గాఢమైంది. ఐతే తుని ప్రయాణము మద్రాస్ నుంచి లేక పాలకొల్లు వచ్చాకనో గుర్తు లేదు. తునిలో తాత గారు చాలా నచ్చారు నాకు. అమ్మమ్మ చిన్ని నీ శిరీషునే చాలా గారం చేసేది. నన్ను కొంచం పొగిడేది. గోపాలం మామ నాకు చాలా విషయాలు చెప్పాడు.కొన్ని నేర్పించాడు. అందులో ఒకటి గోచీ పెట్టుకోవడం. అమ్మమ్మ చీర ముక్కలు మాగోచీలకి ఉపయోగించేవి. తను అప్పుడే RSS శాఖ కి వళ్ళే వాడు . నేను కూడా పడే వాడిని. అమ్మ నన్ను ఒకంత కనిపెట్టేది. కానీ ఒకరోజు అమ్మా గదిలోంచి బయటకి రాలేదు. అమ్మమ్మ తాతగారు హడావిడి గా ఉన్నారు. దొడ్డం మామ నారాయణం మామ మమ్మల్ని కనిపెట్టారు. పెద్దత్త చాలా దయగా ఉండేది. తాయారు సీత దొడ్డం మామ కూతుళ్లు. అమ్మమ్మ అస్తమాటు నాకు పెళ్ళి వరస కలిపేది సీతతో. అది కొంచం పెద్ద. అయినా ఫర్వాలేదని v laakolam చేసే వారు. నాకు చాలా సిగ్గుని పంచేది. అమ్మమ్మ చడ్డెన్నము దానికంచంలోడి నాకు మరి వడ్డించేది. నాకంచములోది తనకు .బావేగా ఫర్వాలేదని పిచ్చి మాట. అమ్మకి ఈ వ్యవహారం అస్సలు నచ్చేది కాదు. నారాయణం మామ సత్యానికి చదువు చెప్పేవాడు. ఏదో ఒక వంకన సత్యం పారిపోయేది. ఆరోజు పాప్లి పుట్టాడు. మేము అంటే నేను చిన్నీ అమ్మని ముట్టుకోకూడదు అని తెలుసుకున్నాము. అమ్మ మాకేసి చాలాఆధారంగా చూసి పాప్లీ తమ్ముడిని పరిచయం చేసింది. అమ్మా అమ్మమ్మ తమ్ముడి స్నానం చేయించే విషయంలో కొంచం గట్టిగా మాట్లాడుకున్నారు. అయినా అమ్మకి ఎంతో అనుభవం కదా అమ్మ ఊరుకోవచ్చు కానీ కష్టపెట్టుకుంది .
అమ్మా సత్యం చిన్ని శిరీషు ఇంతమందీని తాతగారు అమ్మమ్మా ప్రేమగా భరించారు.
[10/31, 1:37 AM] Maringanti Srilakshmi: పాప్లి అని వాడికి నాన్న గారు ముద్దుపేరు తగిలించారు. Chwrwdu కళ్ళతో పుట్టాడు.వీడు పార్థ సారధి అని అమ్మ వాడికి పేరు పెట్టింది. ట్రిప్లికేన్ లో పార్థసారథి స్వామికి అమ్మ దండవెట్టుకుందిట ఆయనపేరు పెట్టుకుంటాననీ.
[10/31, 1:45 AM] Maringanti Srilakshmi: అమ్మకి పిన్నికి ఎక్కువ మాటలుండేవి కావు. ఆవిడకి సంతానం లేదు ఆవిడవ కన్న అమ్మ పెద్ద. బీరకాయపీచు వరసన ఆవిడకి అమ్మ కోడలి వరస. అమ్మని సీత అని.పిలిస్తే నచ్చేది కాదు .
[10/31, 1:50 AM] Maringanti Srilakshmi: అప్పుడే పాప్లీ పుట్టి సంవత్సరమయ్యింది . నాన్న గారు వాడి పుట్టిన రోజు చాలాగ్రాన్డ్ గాజరిపించారు. మైక్ వాదించాడు. పొద్దున్నే అందరికీ తలంట్లు కంట్లో పులుసు పడ్డా పడకపోయినా చింతపండు ఉప్పు ఫలహారం. మీకు వాడు కృష్ణా ముకుందా మురారీ t పాటతో కచేరీ మొదలెట్టాడు.
No comments:
Post a Comment