మన్వంతరములు గడచినవి స్వామి
భవ్యదివ్వావతారమున జగతి వెలిగి
లోపలవెలుపల లేకమై సకలము నీవవై
నవ'పునర్నవములేకమై,అష్ట వసువులు
ఇష్టగతిన శ్రీపాద శుభ చిహ్నములై
చతురాననాది వందితుడవై,త్రిగుణాతీతుడవై
చీకటివెలుగుల కాద్యుడవై మాయ యనెడి
పెంజీకటి కావల ఏకాత్మన వెలుగు హరివి
సంజీవ రూపక భక్తి ప్రపత్తులకై కేల్మోడ్చి మ్రొక్కెద 19 MARCH 2014
19
No comments:
Post a Comment