Sunday, January 18, 2026

 యుద్ధ రంగంలో అంతరంగం

అంతా యుద్ధ విషయమే,
రాగ ద్వేషాలు రెండూ ఒక్కటైపోతాయి.
విజయమో వీరస్వర్గమో
ఒక్కటే ముందుకు నడిపించేది.
ఎల్లగైనా చావు తప్పదు
,వెను తిరిగినా ముందుకెళ్ళినా
గర్హమో అనుగ్రహమో
కాలం కరిగితే నీవుంటావు
లేకుంటే,కాలమాగిపోతుంది,
కళేబరము నశించినా కీర్తి చక్రమౌతుంది
త్రివర్ణ పతాకము
వివర్ణమైన అత్మీయుల మనస్సులకు
నీకీర్తిని తన రెపరెపలతో సజీవం చేస్తుంది
Monday, 17 February 2014 at 13:10 UTC

No comments:

Post a Comment