Sep-2025
బిందువులందందున యుబికుబికి చేరికై
కలసి కొంగుల పొంగై ప్రావాహియై నది
యది సింధు తను పరమేశ్వరి నుదుట బిందువు
సింధు అర్ధనారీశ్వరి చీర చెరగై
హైందవి కన్నుల వెలుగైనది నదిగంగ
అన్నపూర్న వాకిలి కాశిని కడిగి
అస్తమించిన యాత్మలకు పుణ్యగతులిచ్హి
తూరుపు వెలుగుల వెదకుచు వేల్పుల
తల్లి కాళిని చేరి సాగర సంగమమయ్యె
అమ్మా హైందవి నీవ సింధువవె,గంగవె
నర్మదవె,భాగీరథివె,కృష్ణవె అమ్మ
కావెరివై కన్ననికన్న ఆదిదేవు రంగని కొల్చితివి
ఎన్ని చీరల మేలమాడితివి పరమేశ్వర ప్రియ పుత్రీ
ఎన్నిచెరగుల ధర్మవీరుల కన్ను లద్దితివి
ఘొర రక్తధారా పాతముల కలిని కట్టడిపెట్టిన
తొల్లిటిరాజమ్మన్యుల ధమ్మపధ జ్ఞానము
పరిమళించగ జైన బౌధ హైందవ ధర్మాచార్యుల కంటివి
అమ్మ కలికాలమున ధర్మము కుంటిదయ్యు
నీ దీవనవల్ల ఇంకను వుభయ విభూతుల
అవధూతల గలమూ సాత్విక జీవన ప్రేమైకజీవుల
ప్రాణమ్ముల నిలచియున్నది కావవె తల్లి
దుష్ట కలికోర్కెల నడగి అత్యైకములాచరించు
మలి రక్కసులగు నీతిబాహుల వుక్కుకౌగిలినుండు ఎల్లర
పాలిత దేవరల కీవవె సద్బుద్ధి,సగరులను కాదు
సత్య హరిశ్చంద్రుల మాకు ప్రభువులుగ కొరుచుంటిమే తల్లి
దశ హస్తముల శంఖ చక్రాది ఆయుధమూ దాల్చి
శరన్నవరాత్రుల చెలరేగి కడు పాపాత్ములగు
రాజ ద్రోహుల లంచముల పంచన రగులు రక్త బీజుల
దునుమవే తల్లి నాదు రాజ్య ధర్మదేవత గ్రుడ్డైనదే అమ్మ
రాజు రోతగు రీతుల అన్యాయమును ఖండింప అబలుదయ్యెనే
అమ్మ నీకు సకల జనుల వినయ భక్తి విన్నపములివి దయజూపవె!!
No comments:
Post a Comment