అమరావతీ ధమ్మము జయమగుచున్నది జనులార
జన్మ ధన్యమగునీవేళ శిరములు వంచిమ్రొక్కరె
ప్రిథివి పూజనమును గనుడె
పునహ్ పుర గోపుర నిర్మాణముజేయ దేవతలొచ్చిరి
సైకతస్వామి గంగాధరడు గంగను దెచ్చె
యామునాసారస్వతీ,కావేరి మాతలరుదెంచిరి
అమ్మ గోద, పిన్ని కృష్ణ తరలివచ్చిరి
జగన్మాత ధారకలైదుగురు పావనముచేసితిరి
నవజాత అమారావతి బొడ్డుకోయ వచ్చిరి దేవదాసినులు
హొమ ద్రవ్య పరిమళములు ఆకసమును జుట్టుచున్నవి
ఏకపద విన్యాసమున వామనమూర్తి 'సమలంకృతమయ్యె
ద్విపదమున ద్వైపాయనుడు పేచకమను పేరనుద్ధరించె
త్రేణే త్రిపదముల గాచుచు త్రినేత్రుడు పితమనబడె
చత్వారె నాల్గు పదముల నరసిమ్హుడు మహాపితమైనొప్పె
పంచపదముల జీవ గవ్యములగొని బ్రహ్మ ఉపపితమయ్యె
ఆరుపదముల సుబ్రహ్మణ్యుడు ధాతువై స్థాండిలుడైనొప్పె
దశపదయై దిశదెసల ఘనమై గంభీరమై పరిపూర్ణమైనది
నగరమాతకు హుతవాహుడుమంగళారతులీయ దిగివచ్చె
నభోమండలమున దిగ్దేవతలు వాస్తు పురుషుని యాశీర్వదించిరి
మయుడు గయునిగ మర్మములేక శాస్త్రముల నిచ్చె
ధమ్మ నగరికి ధమ్మిల్లమున పారిజాతమాలల జుట్టిరప్సరసలు
సాక్షాన్మహాలక్ష్మి కీర్తి యశముల కుంకుమనద్దె
సరస్వతీ హిందోళరాగమున అశీర్వాద గానము జేసె
అహోనాదు నగరి అమరావతీ మాతా అభివందనము
జన్మదిన శుభాభివందన సహస్రకోటులివె గైకొమ్ము!! 04 FEB 2018
No comments:
Post a Comment