Sunday, January 18, 2026

 ఎంత బలము విధికి,''బలి

కంత వినయము' విధమెరిగియు,
చింత గొనక వామన ధ్యానమున,
అంత రంగమున ఆరతులిడుచు
తండ్రీ! ''తలపై అడు గిడవె ఎద హారమై
నీపదముల పరమ పదము కనుగొనదె
ఇలయొక తలము నీ పద కమలమునిలుపగ
నభము గప్పిగొన్న రెండవ పదము నకు
అహమునారతి చేతు,మూడవ తలమెక్కడిదయ్య
మొక్కి తలను తలపు లొదలి మొదలిచ్చెద
త్రిగుణాతీతుడవు ఘన రూపము అఘన నీవవె
వేదములు ఘనమెజెప్పు సూక్ష్మమరయ తరమె
మూఢ మనుజులకు అనంత గుణములజేజ వీవు
'విడి వడిన మాయ' తృణ వశమున,'ఘన మైన'
నడయాడెడు జీవులముకాదె, కనుగొనిన!
జయము త్రివిక్రమ జయము జయము"!! 18 MARCH 2018

No comments:

Post a Comment