Sunday, January 18, 2026

 ఆత్మ గతమైనదా,అయ్యోకాదు గురుతులు

చప్పున తేలి మనసు వరదైనది
ఈజీవనది సరస్వతీ తోయ పావనఝురి
నిర్ణయ శాసన నిష్టుర కాలమా
కడకు మా పట్టున శోకవీవన వీచితివా
దీవించుమయ్య స్నేహపరిమళ వినయశీలి
మాటన మూట కట్టిన చిరునగవుల పెన్నిధి
కరువా కాలమా, చెరుపు చేయగ
కలయద్రిప్పి పరుష ఘాతమున
మనములనెల్ల'గురుతులె' చాలని,
కనరాని దివ్యలోకములకు గొంపోయితివ
మాదు మనహ:ప్రియ మధురోక్తుల స్వామిని
ఓ దివినుండెడి దేవతలార కదలి రండు
పరమపదమునకు వేంచేయుచున్న
స్వామిని ప్రియమారగ తోడ్కొని
విరళీకృతపరిమళ వీవనల సేవించుడు!
ఓ చంద్ర చకోరములార మీ నిరీక్షణ నాపుడు
మంద గమనమున విచ్చేయుడు శ్రీవైష్ణవ స్వామిని
అమృతకిరణ సంచయముల సేద దీర్చుడు
ఓ తేజస్వాయురాకాశములార అవధరింపుడు
స్వామి మార్గాయాసమున సేవింపుడు
శీతల ఉష్ణోపశమనముల గూర్చి
తండ్రీ, మీయత్మీయుల ధుఖోపశమనమునకు
దీవింపుడు,మీ యానము సుఖమౌ నుగాక
అశ్వనీ దేవతలు మీకు రక్ష
ఆదినారాయణుడు మీకు రక్ష
 
Shared with Friends
scrolling number over keaves of individual life

No comments:

Post a Comment