18 MARCH 2019
చిక్కి మనమున కడు శ్రమయొందిన
నాదు జనని భారతికి తొల్లిటి బిడ్డ
మనువెకాని ప్రియమారగ కనిపెంచిన
భరతుడె పరికర్మి తల్లి వుల్లమున
మల్లెలు పూయించినషట్చక్రవర్థుల
చిన్నగ నగుచు ఎన్నగ కనరాక
వున్నది విడువక భిన్నము కానీయక
విల్లును ధరయించి విరించినైన
వాగ్భూషణమను యంబున పరిక్రమించి
మేధోమధనధ్యానయుక్తముగ పదవికి
వన్నెతెచ్చి తనకు తానె మార్గదర్శి
యా ధీమహి భారతికి కడుపు చిచ్చువెట్టె
సహ్యాద్రిన అస్తమించె గోమంతక శిఖామణి
భారతి మేఖలము చిరిగినదె సోదరులార
అమ్మ ధుఖ్:ము బాపగ వుద్యమించుడీ
అపరఋష్యాత్మ యానంద కందళితముకాగ
No comments:
Post a Comment