Sunday, January 18, 2026

 Nov,15,2025


ప్రేమించావా పాపా,ఔనూ
నేమేజర్ నీ, నాజీవితకి
నేనే కర్తనీ అంటావా,సరే అవతలి వాడెవరూ,మోహన రూపంతో మాయామర్మంతో మెరిసే తళకుల మరకేమో
అచ్చుపోసిన సిలువేసిన
తారుమారు తక్కెడతూగే
తురకేమో,నీప్రేమ పిపాసని
రుధిరంలోకలుపుకుత్రాగేకసాయీ, యూట్యూబు బూతు సిపాయీ కావచ్చుగద!
కనులుతెరచే,పాపా,
ప్రేమించావా?కుళ్ళి,
ముక్కలైన దేహంలో
నీఆత్మని వెతికే
అమ్మా నాన్నా
ప్రేగులు కనలి కనలి
యేడ్చే టప్పుడు ఓ
దార్చేదెవరమ్మా?
'మార్చురీలో కంపోడే
ఖండితావయవాల
పంచనామా' వంచక
ముష్కర ప్రేమోన్మాదమో
బుగ్గయ్యే భూకంపమో
వల కావల చెలికాని
చెరణాల కోలో కావచ్చు
స్వేఛ్ఛ కర్ధం క్షేమాని
కనర్ధంకిరాదు కద తల్లీ
నిండునూరేళ్ళ బతుకు
కుండ విచ్చి పోయే
ఆత్మహననమైయ్యే
ప్రేమౌసరమా ఆలోచించు!

No comments:

Post a Comment