మీ ఆకలి తీర్చే కవితా ఫలాలు చిక్కచ్చు.!!
Oct,2025
ఏమండోయ్ మీకవితలు మీకయినా అర్ధమౌతాయా?
అవునవును, రాసినప్పుడు పూర్తిగా తెలిసే రాస్తా,
కాస్త వ్యవధిలోనే కలల రూపము వేరైపోతుంది. అప్పుడు,
శృంగభంగమైనట్లు ఫీలవుతూనే, రాసేస్తా, పాడేస్తా!
వినేవా ళ్ళలో' బాగనేవాళ్ళు కొందరెప్పుడూ వుంటారనుకోండి!
తప్పనిసరిగా అర్ధములోకి దిగేవాళ్ళు! బహుశహా
తలపట్టుకుంటార'నుకుంటానండీ.!
కలలూ ,భావాలూ కలగలుపులు కావు!
కానీ గుర్తుంచుకోవడమూ విద్యేసుమండీ,
కళ్ళల్లోకీ,స్పర్శలోకీ వినికిడిలోకీ, ప్రవహించి,
సూన్యములో దారి పరిచేది 'భావుక'తే సుమండీ!.
అది ప్రాణంపోసుకునే రూపాల'ని తలుస్తూనే వుంటుంది!.
ఆ చైతన్య ప్రహేళికలో 'వూహల'కు రెక్కలు వచ్చేస్తాయి.!
మనస'నుకుంటూనే వుంటుంది,కానీ, వూహలు విహంగాలై,
మేఘాల మాలికలై,స్వరూప చిత్రాలైపోతాయి!
మలయ మారుతాన్ని తాకి మధుర కావ్యాలవుతాయి!
గ్రీష్మ స్పర్శకి భీషణ కావ్య గర్జనలవుతాయి!
జడివాన తాకిడికి వెల్లువై, పాషండుల గుండెలు చీల్చేస్తాయి!
. నేచెప్పేది విని, నువ్వు ఘోషిస్తే, ఎవరోవొకడికి
తప్పకుండా అర్ధమవుతుంది సుమీ!
చీకటి వెలుగుల్లో మసకలాడే నా'భావుకత'
అర్ధంచేసుకోవడమంటే, 'నీటిలోనీడని వేటాడడమే'
నాలిక భాషేమీకాదు 'నా'కవిత! ఏలికల పాలికి,రాసిందీ కాదు,!
అందుకనే గాలమేసి నీడని పట్టుకోండి!
మీ ఆకలి తీర్చే కవితా ఫలాలు చిక్కచ్చు.!!
Posted by satya lakshmi at 6:30 AM....
No comments:
Post a Comment