Satyanarayana Charyulu Maringanti-Sep-2025
అడుగులు గతంలోకి దిగబడుతున్నాయ్
నిన్నకి ముందు గడి ఊడిన తలుపు వెనుక నేటికి జాడట,
అయ్యో తొంగి చూడ నైతినే!
నీడలు జాడ మారి నిజం కురచై
ఓడలు బండి బాట వెతికేను !
బతుకు తెల్లారేలోపు,
బరువు దించుకుంటే నయం కదూ,
ఆసామీ, maa taata gaari గారి
వూసెక్కడా? నే బండిదిగేలోపే చెప్పు. చప్పుడు కాకుండా నిష్క్రమిస్తా, అంటే
ఆసతోమా జ్యోతిర్గమయ
అంటారే అదనుకునేవు, కాదుసుమా కసురుకునే
పిరికి మనసుకు చావంటే
చెప్పలేని భయం,నిజం
శుష్క శోధనలో మస్తిష్కానికి
అందని అపరిష్కృ త సత్యం
భుజమెక్కి ఆడుకున్న రఘు రాలిపోయాడు,భుజం భుజం
రాసుకు తిరిగిన శేషగిరి రావ్
నిశ్శేషమయ్యాడు, నిజానికి
సత్యం చదివిన్దెప్పుడు,,..
No comments:
Post a Comment