Sunday, January 18, 2026

 సత్యం ఙ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశమ్ |

గోష్ఠప్రాఙ్గణరిఙ్ఖణలోలమనాయసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ |


16 June 2022 
Shared with Friends
అవధి వశమైన ఆనంద గంధ సుందర మూర్తిమంతం
వివశా విలోల కలిత హృత్ చకోరీ చంద్ర సంసేవితం
వివిధ కాలకలిత జీవజాల సకల నిబిడ కల్మష దురితం
నిజవిజగీషాబలబుధ్ధి వినయ విమల విశేష సంకలితం
మన్నుతినుమిషనతన్ను తన్ననెంచిన వెన్నలమ్మ
అమ్మో యనికూలె,'నిజ బింబ,భూతయభూత,
ముల్లోక కల్లోల యుత్ఫుల్ల స్నిగ్ధ దగ్ధ ద్వందమ్ము
మునిగితేలి', విభ్రమయయ్యె గద, .గదాధర శ్రీధరా
అవనికి భారమెయ్యది ఘనముగ యోచించిన అఘనమె
అనృతమే సత్యకామ నిత్య నియుక్త వివేక విస్తృతుల
ధర్మన్యాయ కాల ఋతు కల్ప సంకల్ప పరికల్పముల
తనతనువున తీర్పుకాని సంగ వ్యసన వ్యాసంగముల
భజింతు గోవింద ధ్యాన మగ్నమౌ మది యెయ్యది య
నింద్యమొ యెవ్విధమునది పంచేంద్రి సంచయమునకు
చెందియు కవ్వము పెరుగున తిరిగి వెన్నను పొందియు
తినదో బృందావన చోర చేరినీవవే పరమ భ్రహ్మ చారివి
తొల్లిటి తొలకరిన సకలజీవముల బిందు రూప గతిగ
అల్లిన వలమాయగ జలపాత్రన చిక్కిన చిద్రూప ఘనమీన
కల్లకాలమును చెల్లుచేయగ సత్యవ్రత విమల మతికి సర
సల్లాప వశమున కాలధర్మ సమఙ్ఞాన దానమిచ్చితి గదె
ప్రళయ పయోధి నర నగర ఖగ మృగ తిర్యగ్జడముల
సకల జీవ నిర్జీవములత్రెళ్ళించునెడ తేలి యూగెడు
సఛ్ఛిద్రూప వటపత్రశయన లోమహర్షణప్రోక్త సూనృత
మత్స్యాది మానవ పర్యంత పరివ్యాప్త లోక విలోచన


Mar Vense
వాడుక భాషలో రాస్తేనే ఎవరూ చదివి చావటం లేదు అన్నా. కష్టపడి గ్రాంథిక భాష లో రాసారు.
బాగుంది. బహుశా, ఈ పరిస్థితి వస్తుంది అనే కాబోలు... గురజాడ, శ్రీశ్రీ, శేషేంద్రశర్మ గ్రాంథిక
బాష లో కన్నా వాడుక భాషలో రాసి రక్తి కట్టించారు. ఇప్పుడు వాటినీ పట్టించుకోవడం లేదు. నా మటుకు అయ్తే బాగుంది.

No comments:

Post a Comment