మానవీయ మహాప్రస్థానములో విలువలు ఙిఙ్ఞాసావిష్కరణలు. భగవాన్ శంకరులు
ఙిఙ్ఞాసామధనంలో అంత వరకు చేరనిలోతుకు చేరి తన మనో వికాసాన్ని మానవ మేధోపురోగతికితోడ య్యారు. అప్పటి అవిష్కరణలు మన (మానవ) జాతి గమనములో మైలురాళ్ళుమాత్రమే. గీత గోవిందంలో చెప్పినట్టు వ్యాకరణాన్ని వల్లెవేయడము పురోగమన గతి కాజాలదు. మన దృక్పధము నిరంతర పురోగామిత్వముకావలె నన్నదే మహానభావుల ఆశయము. సత్యసోధనలో మనిషికి యెదురయ్యే ప్రశ్నలకి జవాబులు మారుతూనే వుంటాయి. ఎందుకంటే సత్యము నిశ్చయంగా జటిలము. నిత్య నవ జాతము. పైగా బ్రహ్మ విద్య. గురుభావము గురుత్వ గరిమ నిత్యనిరవధిక సోధనలోనే అంతర్లీనంగా వుంటాయి. మన'ని మనము అవగాహన చేసుకుని అవిష్కృత సత్యములన చదువు సంస్కారముల ద్వారా పరివ్యాప్తి చేయడమే ఆచార్యుల ఆంతర్యము. సహ జీవన సౌరభంలో వినడమూ వినుకోవడమూ అనేవి నిత్య వ్యవహారాన్నీ సత్య వ్యవహారాన్నీ పొంతన చెయడములో ఒదిగి వుంటాయి..........18 MAY 2016
18 MAY 2016
No comments:
Post a Comment