త్రిపుర కధలు చదువూ,చదువు కధ చదువు
కొడవటిగంటీ గుడిపాటీ చాటు మాటు కాదు సుమా
చలమూ అరుణాచలమూ పెనవేసుకున్న అనుభవాలూ
చిన్నప్పుడు దూరంవీ, దూరేవీ చదివి తగలేట్టుకున్న చదివేవు చెద పొదల గాజిగాడి చదువు!!
పరవస్తూ, అస్తు అని చెప్పిన చదువూ,
ముందస్తు చూపుకు రూపైన చదువును చదువూ!
కలసిరాని కలికాలం చదువని'తెలివిడి చేసేవీ చదువు!
పిల్లలకైనా చదువంటే చెదరని భాగ్యమని తెలిసేవి చదివించు!!
మనసుని కెలికేవీ, వయసుని తొలిచేవీ,
పచనము కాని రచనలనీ చదువనుకుంటే
కల్లునుచూసి పాలని త్రాగినట్టే!
నీలంవారి రచనా, నార్లవారిమాటా,
జాషువాగారిఘోషా చదువుకు కలగూరగంపలె!
కంటికి ఆననివీ వెలిగేను
వింటే విననేర్వనివీ వినికిడి అయ్యేనూ,
చదువు చదువు తండ్రీ చదువుల మర్మమెల్ల నింగిని చేర నీటికి వస్యమగు
No comments:
Post a Comment