Wednesday, April 23, 2025

 జీవించేందుకు నాగరీకత కావాలా?

పాలించేందుకు పరిపక్వతకావాలా?
సోధించేందుకు దారులుకావాలా?
నాగరీకతకైతే పరిపక్వత కావల్సిందే
పరిపక్వతకైతే సోధన కావల్సిందే
దారిచేసుకుంటూ నది సంస్కారౌతుంది.
నీడ క్రీనీడల మధ్య పారాడే బ్రతుకు
మాయా మత్సర సంకలిత జీవధూళి తృప్తము
సంధి విగ్రహాల మధ్య దోబూచులాడే దాని మనసు
మిగులూ తగులూ మాటలకు నొచ్చుకుంటూనేవుంటుంది
నీకు మాటలాడడము రాదు ఏంపాటపాడతావూ
నీ దృష్టే లోపము దూరమూ దగ్గరా ఏంచూస్తావ్
పరికించడమే సాధ్యంకాని నీకు పరిశీలనా సామర్ధ్యమా
అహంకారము తిరస్కారమూ తోబుట్టువులే
కళ్ళకి కానవచ్చెది రూపమైతే
మనసున పల్లవించేది స్నేహము
అది లేనప్పుడు కనిపించేవన్నీ లోపాలే
నీకు బాధ్యులు ఇతరులైతే నీవెవరికి కర్తవు
నిరహంకారీ,నిర్ణయదురహంకారీ,
మనిషీ నీ నైజానికి రెండు పార్శ్వాలు
తెలిసీ మాట అనడమూ తెలియకా మాట వినడమూ
నిజానికి రెండూ బలహీనతలే,
వయసూ పసితనమూ పెనవేసుకున్న అవస్తలే
మసి పట్టని మనసుకు ఎదుటి లోపాలు
దిద్ది చక్కబుచ్చుకునే మధురాంశాలు
All reactions:
1
Like
Comment
Share
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

No comments:

Post a Comment