మనసెంతమృదువు, మాటెంత మధురం
మనిషి వినయ విపంచిక శాంతతృప్త వదనం
జీడిమెట్ల వెంకటేశ్వరుని సన్నిధిన దొరకెనీపెన్నిధి
తలితండ్రుల బంధుజనుల వుల్లాస కర దీపమాతడు
ఎంత వగపుకులోనైనది నామనసు, దైవమా ఇది సత్యమా
ఇంతటి కఠినమా నీ కృత్యాకృత్య హేతుహేతుమధ్భూతక్రియ
నిరుటి వత్సరము నల్లాని కలువ తులువల చేత నలుపాయె!
మరల జలజాల వాయువ్యోమ గహనాంతర గమన గుహ్య కరోన,
కృతకమృత్యు కరకరాళ ప్రేత దిగంత మానవ హనన ప్రజ్వల ప్రబల
కైకొని పోయె అయ్యో,యంతరంగయవనిక చాటుప్రియ బంధుజనముల
ఏమని యెరుకజేతు నామానిని హృదయ హిమ వీచికా ప్రఫుల్ల సుమ సౌరభ
విమలసౌశీల సుశీల ముంబయి మట్టిన మెట్టిపోయె, చితికెనాస్మృతి జాలము
అన్నమారగింపజేసిన యమృతమూర్తియామె,స్నేహహామృతమున స్పృహతానై
ఖిన్నవదన వదినెసీతమ్మగారిసేవన సకల శ్రేయమునిచ్చిన ఆపన్నహస్తమె యితడు
వినోదనుపేరునువినయ వివేక కారుణ్య మూర్తిబరగుననెంచిన యాతడగుపించు కనుల
అఙ్ఞాత వాసముననున్న నామనసేాలనింకను కృంగకయున్నదొ ఇట్టివిపరిత ఘాతముల్దిని!
మంచితనమా, నికాయువేల స్వల్పము నీవేల నిబిడమున హృదయ లయదప్పి నింకి పోయెదవు?
No comments:
Post a Comment