Wednesday, April 23, 2025

 కులమా సంకుల చిత్తమా మానవ మేధకి

మొలకెత్తిన వికృత రూపమా మారణ హోమ ధూమమా!
కాదు, కాదది నరుని నాల్కన వినరాని క్షర దూషణమే!
వర్ణము కాదది వ్యర్ధాన్నవినియోగము, కాదు కాదు,
ధర్మ విదూరులు తెచ్చిన వర్ణ చీలిక, కాదు కాదు,
పాలికలు క్రుద్దులై శపించిన తామస నీచ కులిక,
కాదు కాదు, పంచేంద్రియపతిత, ఫలిత పదభ్రష్ఠులు
సమ సమాజమున శృ తిచేసిన 'జారచోరసంచారజీవ'రీతుల
'కలి కలిత చూలికలు', ఔను, నా భారతికి, నాతల్లికి
శాంతికి కాంతికి, ఘటిల్లిన 'గ్రహణ రణ' వ్రణములు!
వాల్మీకి చరకుడు సుశ్రుతుడు సుమనస్పతుల్లెలరు
కూడి పోరాడిన సకలారిష్ట అవశేషములు కావే యవి
పుళిన జనజీవన హిత రహితములని 'దక్షవాటికన'
ప్రాక్త్యక్షముగా పినాకపాణి పంపున భద్రుడు వీరభద్రుడు
భూతగణముల గుణముల గ్రుచ్చి పంచాగ్నులవ్రేల్చలేదే!
మత్య వరాహ కూర్మ వామన పరశురామ రామ కృష్ణావాతార
విశేషములు కందురే కలి సుల్భ బంధిత మ్లేచ్ఛాది నరులు కందురే
కల్కి తన నిజకర విజృంభిత కరవాల ప్రవాళ కాంతుల త్రెంచక ముందు
గమనములోకి రానిది స్థితి మూర్ఖతకాదె కులములు కోటయినవి
వర్ణములు సహస్రాధికములై చట్టుబండలైనవి !
మానవీయత మేల్కొలుప గళమెత్తిన రామానుజులు
కృష చైతన్యులు జాతిపిత దేశభక్తులు వేవేలను మరతురే
పాషండుల గుండెలు గావె యవి మానవత్వము చేకొనకున్న
జాషువా రవళించలేదే గళమున అమృత సత్యహరిశ్చంద్రమును
ఘోషణ భీషణ మాంగోలుల ఘోర పద జారులంతరించిరిగదా
ఇక జాగు సేయక మనసు తలుపు తీయుడు మన్నన చేయుడు
పిడికెడు మాదాకబలము తిని మనసారా గణమునుకొల్చెడు వాడు బాపడు
వైశ్రావణగణములో కాదో గాని ధర్మ యతులు కోమటులన్న మన తొల్లిటి యునికిన
సూద్రకడు మేదినీ పతి ఋగ్ సామవేద గణిత గణక చక్రవర్తి మృచ్ఛకటిక స్పృహను
అధముడెవ్వడు వాడు కిరాతుడు మ్లేచ్చుడు పశువని కామవశుడని జనాంతికమది
జన్మ చేత గుణములు కావని గుణముచేత జన్మమని కారణజన్ములు ఘోషించిరి గద
ఓ సకల జన సమ్మానులారా విద్యావాచస్పతులారా బోధకులారా ఆచార్యులారా
వేదఘోషను జీవ భాషను భావ రాగ తాళ శోభితముగా గళమెప్పి గానము చేయరే
అవనిన అన్య మతమున మన మాన్యతను సమ్మానింపరే తలితండ్రులరుణము దీర్చరే
పరులెవ్వరు మనకి ధరణిని అన్యులాద్యులు మనకు ఉపచారసేవలందు పరమపూజ్యులు
చీలిన చీలికలు దేవాంగనలు దాస్యులు సేవకులని తామస జనులు
ధనమున మనమును వలచి యారగించి వారసత్వమొనరించిన వారలు
కారు మనకు దీపకులు వారలు కుల కలకల కాకములు కాక వేరెవరు
All reactions:
Seshasai V Kocharlakota, Chalapati Rao and 8 others
16 comments
12 shares
Like
Comment
Share
Satyabhama Maringanti
బాబూ చాలాఅర్ధవంతంగారాశావు ఆరోగ్యంజాగ్రత్త గాచూసుకుంటూ మనవ్యపకాలలోమనంవుంటేనే ఆనందంగావుంటాం మనబాధ్యతలుపూర్తయిపోయాయి వెంపర్లాటలు వీపువెనక పారేసి మనసుకునచ్చనకార్యక్రమాలుచేసుకోడానికి ఆభగవంతుడు మనకి సమయాన్ని ప్ర సాదించాడు
  • Like
  • Reply
Vani Seshu Seshu replied
 
3 replies
Satyabhama Maringanti
హాయిగా ఒక లేఖరిని చూసుకుంటే నువ్వు చెప్పిన వన్నీ టైపుచేస్తాడు లేకరాస్తాడు ఆనక తప్పులు దిద్దుకుంటేసరిపోతుంది
  • Like
  • Reply
Venkateswarlu Stps
వాస్తవాన్ని అక్షరక్షరం సాక్షాత్కరింపజేశారు. చాలా బాగా చెప్పారు. కుల కలకల కాకములే వారలు. సత్య మరింగంటి గారికి అభినందనలు. వారి గురించి మిత్రులు ఆందోళన చెందుతున్నట్లనిపించింది. ఏమిటో?
  • Like
  • Reply
Venkateswarlu Stps replied
 
3 replies
K P Rangacharyulu Vangala
కావా ఇవి అక్షర తూణీరాలు,తగలక పోవు లక్ష్యాన్ని,మార్చకపోవు అజ్ఞాన మష్తిష్కాల్ని.
  • Like
  • Reply
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

No comments:

Post a Comment