Wednesday, April 23, 2025

 సమ సమాజ దశని త్రేతాగ్నుల సాక్షిగా తెలుగులనుభవించారు. శ్రీకాకుళాంధ్రదేవుడి ఆవిర్భావము నాటికి జైన బౌధ్ధ మతాల పరి వ్వాప్తికి తెలుగుల సాదరణస్వభావమూ,మానవీయ మన్నన ఉదాసీనత కర్మ సిధ్ధాంతము వర్ణ వ్యవస్తల పట్ల గాఢ విశ్వాసము తీవ్ర విషయ లోలతా కారణాలుగా కన్పట్టు తాయి. సౌమ్యులైన జైనులూ బౌద్దులూ వారి నాగరికతలూ తొందరగాసిధిలమయిపోయాయి. వేద ధర్మాన్ని పంచాగ్నుల్నీ మన్నించే వాళ్ళూ ఖండించే వాళ్ళూ గా జనాల్నీ వలస వచ్చి నిలచి కలిసిన వాళ్ళనీ విడ దీస్తే పంచములూ చార్వాకులూ తెలుగుసాయిబులూ తెలుగు క్రైస్తవులూ సమూహాలుగా వ్యక్తమవుతారు. రాచరికపు వ్యవస్థా బానిస వ్యవస్థా నాగరీకతతో అవ్యయంగా తటస్ధమయినవి. రెడ్డి రాజు కమ్మ క్షాత్ర శక్తులయ్యాయి. చావు కారణంగా పాపపుణ్య భావన తత్కారణంగా బ్రాహ్మణభక్తీ వేద మర్యాదలూ పాదుకొన్నవి. ద్విజుడు మనోవికార లంపట సంపర్క దోషాలతో మైందుడూ,సుకుమారుడూ కిరాతుడూ అజామీళుడూ అయినాడు. తెలుగు నాట కళ్ళకుకట్టే యీ పరిణామ క్రమములో కృత్యాకృత్యల సంతానము రాజ్య మేలడము మేల మేమీకాదు. కానీ మాటకీ నమ్మిక చేతకి చేరికా ఆశించడము భంగపాటే. వుపద్రవాలని ఎదుర్కోవడాని సర్వాన్నీ త్యాగం చేసే వాడే రాజు. కాని అట్టి త్యాగి సన్యాసి గా మనమెరుగుదుము. అంటే స్తితప్రఙ్ఞత్వానికి యోగి యోగ న్యాయము అను వర్తితము. సర్వం సహా దానం చేసిన మహారాజుల కధలు మన మెరుగుదుము. సమ సమాజ న్యాయము నిప్పు నీరులా పృథ్వీ అకాశమూలా తేజో వంతము. అట్టి పాలన చేసిన వారు షట్చక్ర వర్తులే. శ్రీరామ చంద్రుడు సాక్షాత్తూ అవతార పురుషుడైనాడు.

All reactions:
Mar Vense
Share

No comments:

Post a Comment