ఊసులాడేవాబాలా ఊసులాడేవ
మోసులెత్తిన మోవి తేనియలు
మురళి మోహన రవళి నలది
గోప కన్నియల రాస లీలల
ఊసులాడేవాబాల ఊసులాడేవ
మురిపాల ముజ్జగముల జేజలకుజేజ
హరి పాల బుగ్గలు కంది కెందామరలైన
వైనము ఊసులాడేవ బాల బోసినగవుల
నల్ల కలువల మేని ఎల్ల లోకముల మాయ
విల్లు శంఖము చక్రము చేరి చామరము
అల్ల అరికాలి ముద్రలు కల్ల కాళీయ తలనద్ది
చల్లలమ్మెడి వారిని ఎల్లవేళల కాచినచల్లనయ్య
ఊసులాడేవాబాల వూసులాడేవ
నిదురపో తల్లి నిదురపో
బాల రాముని లాలి పాడేను
గోపబాలుని జోల వేసేను
నిదురలోన అన్నయ్య కన్నయ్య
ఎదురు వచ్చీ దోబూచులాడెను
బలరాముడేమొ బంగారు బంతి నిచ్చెను
ఆటలాడి అలసినమీకు
యశోద ఆవుపాలిచ్చేను
గోపయ్య నెమలికనులిచ్చేను
నిదుర పోతల్లి నిదురపో
No comments:
Post a Comment