Wednesday, April 23, 2025

 నగరాలూ గగనమూ నిస్తబ్దమయ్యాయి.

వనఋహాలూ ఘనమృగాలు
నగరసంచారమట,నిజమే,
చోద్యమే మరి,అడవి చడితగ్గింది కదూ
గుడ్లార్పని గూబకి చోద్యమే గాలీ చలీ పట్టని
పులీ సంసారమూ,
నిద్రమోహం కొండముచ్చులూభయమే
అందమైనఅడవి తల్లి బిడ్డలురోడ్లెక్కాయట,
ఒక జబ్బు గుఫ్ఫున మనిషినలముకునే సరికి
అడవి సంతుకు సంకెళ్ళుతెగాయి!
అవును, చీకటి చింతైనా
పగటి అడవి బద్దకం చోద్యమే
మరి చూస్తూనే వున్నా నెలలుగా
అడవినేలని పగటి వెన్నెలా రాత్రి నిద్దురా
సద్దుతగ్గిన వసంత చింతన
అబ్బురమే నాకళ్ళు చూసిన కాలంలో
శ్రీమతి తె.క.మంగళ గారి గుడ్లగూబ చిత్ర స్ఫూర్తితో,
All reactions:
Samavedam Srinivas

No comments:

Post a Comment