Wednesday, April 23, 2025

 కనకదుర్గ తెలుగుల తల్లుల హృదయైక స్పృహ

పార్వతీమాత కారుణ్య ప్రావాస రూపిక వెరసి తన
అమ్మల కొలువుకు పసుపుకుంకుమలపంపుకు
వెలసె నాదు వాడ బెజ్జము కొండన గుడికట్టుకు
మడి గట్టి మహిళలు అమ్మకు తొల్లిటి దినముల
కృష్ణమ్మ తీర్థములు కొనివచ్చి నలువెట్టి నలుగును
నారాయణి పుత్రునిజేసి కొండమొగననిల్పి నారద
గాన ప్రణుతి జేసి అమ్మను అందలమెక్కించెడివారు
అందచందములకు చందనముల కప్పురముల
సుందర పుష్పపేశల గంధముల వడలు దిద్ది సిరి
సిరులుగాదమ్ముకు అయ్యో అమ్మ నీరూపు మెదులు
మనమున చేతుల చేత రాదే అమ్మ నిను తీర్చ మేమెంత
దయను దాల్చవే నీదివ్య రూపావిలాసముల, పూజింతు
మని భక్తి తత్పరతల తనుహృద్భావ పూర్వకముగ తలను తల్లి
పాదముల తాటించి వేడగ అమ్మ నిజరూపమున నిల్చెనట
ఆడబిడ్డలు దిద్దిన పసుపు కుంకుమల రాజిల్లుచు
తన ముక్కున గ్రుచ్చిన ముక్కెర సాక్షిగా రక్షింతు
బిడ్డలారా మిమ్ము రక్షింతు మీ మీ పెనుమిటులు
చేయ తప్పులు కుప్పలు కాకమున్నెకన్ను తెరచి
అన్నన్నా చట్టము కోపోదుమా దొంగసిరులన
పరమ పదమున వాటికి దారి లేదని ఒప్పింతురేని
తప్పక కరుణను మిమ్ము, లేకున్న గంగ కృష్ణమ్మ
పొంగి నా ముక్కెట్లనుముట్టి నన్ను మేల్కొలుపును
అప్పుడు తప్పక వచ్చి శిక్షింతును మిమ్మెల్ల ముంచి
ఎక్కెడెక్కడ చారులు చోరులు దొంగసొత్తులు దెచ్చి
నా వాకిట దాచిన రోజున రాజు ఉపేక్షించెనేని
నే నొప్పను వాడెవ్వడైనను కొలువున నిలువెల్ల
విషము నింపుకు బీదయని బిక్కియని వివరము లేక
దొంగిలించిన బంగారు ధన ములు స్థిరములు
చర చార చోర సంపదలు మురికి చేయు నా సెలవును
సెలవిచ్చెద నిక పేరు తీసిన రఘు అఘము కానీ భ్రష్టుడు
సెలవిచ్చెద నిక శివ పేరున నిల్చి దోచిన చిన్న పాముకు
సెలవిచ్చెదఁ ధూర్త రాజకీయ కబంధులకు దేశదిమ్మరులకు
కొలువున్న నిలిచి దోచి దుష్టమును ఇష్టముగనెంచిన
అయ్యేయసులకు ఐపిఎస్సులకు చిన్న తోడేళ్లకు
చిరుత విషమయ మరుగుజ్జు మనుషులకు మనిషి
మాంసమును గోమాంసమును తినేడు ఘోర రాజమ్మన్యులకు
వారి పరివారాజనములకు తధ్యం చూడుడు వెనక
నా రాక బ్ర్హహ్మము చెప్పెనట మరతురే మంచి
వివక్ష ఓరి అధములారా మీమీ భార్యల మాంగల్య
చేతనమున ఉపేక్షించితి ఇక తప్పులు నూరులు మీరె
కనక మహా లక్ష్మి దుర్గ శక్తిని శాంభవి మహిషాసుర
మర్ధినినేనే కాత్యాయిని కాదంబిని ఛండిని నేనే
నాకాలి గోటిని మీటి మీ దౌష్ట్యమును నాశము చేసేద
చూసేద శoకరుడేమిచేయునో,నారాయణుడేమనునో '
ఇది నా నవరాత్రి హెచ్చరిక రాజుకు రోజుకునె డి
కలి చెలిమికారులకు కాళినినే కాల్చకమానను
All reactions:
Venkata Rama Krishnayya Tippabhotla, Satyabhama Maringanti and 1 other
3 shares
Like
Comment
Share

No comments:

Post a Comment