Wednesday, April 23, 2025

 అక్కరలే నక్షరాలను లెక్కకు మించి చదివేవా?

ఓ మనసా నది దాటాలంటే గట్టున పరిగెడతావా!
నేలవిడచి సాముచెస్తే ఏమౌతుందో తెలుసా!
ఇంట గెలవడమంటె రచ్చలో గవ్వలాటకాదు
కాలక్షేపంకోసం కబుర్లాడడమలవాటైతే
కాలుగడపాదాటదు నోరుమూతాపడదు.
ఏదీ, దేనికీ,ఎవరూ, ఎందుకూ, ఎక్కడ, ఎలా
చక్కటి ప్రశ్నలే, కాని జవాబు నిన్ను నడిపిస్తేనే
పని జరగాలంటె ఏదోపక్కనుంచి మొదలెట్టాలి.
కళ్ళూ చెవూలూజొడించీ మనసుకు పనిచెప్పాలి!
బుర్రకివిశ్రాంతంటే మనసుకు ఇచ్చకాలముచ్చటకాదు.
నదిదాటాలంటే ఈతనేర్వాలి బలంకావాలి.
ముందుకెళ్ళాలంటే ముందడుగెయ్యాల్సిందే!
బొందితో కైలాసమన్నట్టు బుధ్ధి లో వివేకచింతన
చింతన అంటే కరిగే కాలం తరిగే స్పృహ
కాళ్ళు నడవాల్సింది, చేతులుచెయ్యాల్సిందీ,
కళ్ళుచూడాల్సింది వళ్ళు తెలియాల్సిందీ!
చెవులు పెద్దగావినిల్సిందేం లేదు,తను
హోరుకు జొరీగకాకుంటే ప్రశాంతమే!
త్వమేవాహమంటే ఆత్మైక్యమనః పరిపాకమే!
All reactions:
Lakshmi MV and Sudha Mudumbi
2 shares
Like
Comment
Share

No comments:

Post a Comment