చిత్రం కదలి సాగి కరిగేదే
విచిత్రం మదిలో మెదిలే దృశ్యం
విభ్రమ మతి విచలితయే
చలిత గతిన త్వరిత మతి
పంచాయత దృత ప్రకృతికమే
పూర్వసంధ్యా ప్రవర్తిత ధ్యానమగ్న
అవును శరీరాశ్రిత జీవి విహ్వల మతి
చపల సహస్ర చక్షు వీక్షణి క్షణికానంద
పెరిగే సంపద పద గమనంలో నలిగి
తరిగే పంచప్రాణ ఝురిలోలుప్త గుప్తమే
ఆత్మాలయ ప్రాణి జన్మజరామృత్యుబంధ
గత సంచిత కర్మాకర్మ చరాచర విపంచిక
No comments:
Post a Comment